Advertisementt

రామ్ చరణ్ రాకింగ్ లుక్..!

Mon 15th Aug 2016 10:47 PM
ram charan,mega power star,dhruva movie first look,geetha arts,ram charan look in dhruva  రామ్ చరణ్ రాకింగ్ లుక్..!
రామ్ చరణ్ రాకింగ్ లుక్..!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, గీతా ఆర్ట్స్ ధృవ చిత్రం స్టన్నింగ్ ఫస్ట్ లుక్ విడుదల

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలుగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'ధృవ'. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ ధృవ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ అదిరిపోయేలా ఉన్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చెర్రీ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విభిన్నమైన కథాంశంతో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన 'తని ఒరువన్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ అందచందాలు, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ.... రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న 'ధృవ' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గర్వంగా జరుపుకుంటున్న వేళ మా 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో కూడిన కథ కావడం... దానికి తగ్గట్టుగా రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు. తనను తాను డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసుకోబోతున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ఆడియో రిలీజ్ డేట్ వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు. 

నటీనటులు

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు

సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా

మ్యూజిక్ - హిప్ హాప్ ఆది

ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

ఆర్ట్ - నాగేంద్ర

ఎడిటర్ - నవీన్ నూలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్

ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్

దర్శకుడు - సురేందర్ రెడ్డి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ