Advertisementt

టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్..!

Mon 15th Aug 2016 09:36 PM
tollywood updates,oxygen,hyper,vekkirintha,bava maradalu  టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్..!
టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్..!
Advertisement
Ads by CJ

తేదీ: 15-8-2016

1. సెప్టెంబర్‌ 30న రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌, 14 రీల్స్‌ మూవీ 'హైపర్‌' విడుదల

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'హైపర్‌' రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. వైజాగ్‌ షెడ్యూల్‌తో టోటల్‌ టాకీపార్ట్‌ కంప్లీట్‌ అవుతుంది. సెప్టెంబర్‌ 9కి పాటల చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. సెప్టెంబర్‌ రెండోవారంలో ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం.. అన్నారు. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

2. 'వెక్కిరింత' పాటలు విడుదల 

కాకర్ల నాని (శ్రీధర్), వినీత్ , ప్రేయసి నాయక్, మౌనిక రెడ్డి ముఖ్య పాత్రల్లో కాకర్ల రాహుల్, శ్వేతా సమర్పణలో లాస్య క్రియేషన్స్ పతాకం పై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మిస్తున్న 'వెక్కిరింత' సినిమా పాటలు ఆదివారం హైద్రాబాద్ లోని సారథి స్టూడియో లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత సాయి వెంకట్ సిడి ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఘంటాడి కృష్ణ, మహిత్ నారాయణ్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం సాయి వెంకట్ మాట్లాడుతూ .. ఈ టైటిల్ ని తేలికగా తీసుకోకూడదు, టైటిల్ చాలా బిన్నంగా ఉంది. ఈ ఏడాది చిన్న సినిమాలే మంచి ఆదరణ పొందుతున్నాయి, తప్పకుండా  ఈ సినిమా మంచి విజయం సాదించాలి అన్నారు. 

దర్శకుడు జంగాల నాగబాబు మాట్లాడుతూ .. ఈ నిర్మాతలు ముగ్గురు మంచి మిత్రులు,  త్రిమూర్తుల్లాంటి వారు నాకు అండగా నిలిచారు. అనుకున్న సమయంలోనే చిత్రాన్ని పూర్తీ చేసాం. మంచి మ్యూజిక్ ఇచ్చారు,  కొత్తవారు హీరో హీరోయిన్స్ గా  పరిచయం అవుతున్నా..  కూడా అనుభవం ఉన్న వారీగా నటించారు అన్నారు. 

నిర్మాత  మాట్లాడూతూ .. అనుకున్న విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. తప్పకుండా  అందరికి నచ్చే అని అంశాలు ఉన్నాయి. త్వరలోనే మిగతా కార్యక్రమాలను పూర్తీ చేసి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: చంద్రలేఖ, భాను ప్రసాద్,  కెమెరా: వాసిరెడ్డి సత్యానంద్,  ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: కే శ్రీధర్, టి పద్మలత, నల్లా వరుణ్ తేజ్, నిర్మాత: కాకర్ల నాగమణి, కథ , స్క్రీన్ ప్లే దర్శకత్వం: జంగాల నాగబాబు. 

3. 'బావ మరదలు' టీజర్ విడుదల

మోహన్ కృష్ణ, శిరీష, సౌజన్య హీరో హీరోయిన్లుగా గంగారావు లక్ష్మణ మూర్తి దర్శకత్వంలో మాణిక్య మూవీస్ పతాకం పై రాజు నిర్మిస్తున్న చిత్రం 'బావ మరదలు'. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. టీజర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. మోషన్ పోస్టర్ ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకుడు సముద్ర తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. కొత్త దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్స్ అందరు కలిసి చేసిన ప్రయత్నమిది, తప్పకుండా  ఈ సినిమా మంచి విజయం సాధించి,  ఈ టీమ్ అందరికి మంచి పేరు తీసుకురావాలి.. అన్నారు.  

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ .. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా మంచి విజయం సాదించాలి.. అన్నారు. 

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. మంచి అవగాహనతో సినిమా చేస్తే .. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను అందుకుంటాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలు డబ్బులు బాగా తీసుకురావాలన్నారు. 

చిత్ర నిర్మాత రాజు మాట్లాడుతూ . సినిమాను అనుకున్న ప్లానింగ్ లోనే పూర్తీ చేసాం. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన అందరికి థాంక్స్ అన్నారు.  

దర్శకుడు గంగారావు లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ .. అతడు ఆమె ఓ స్కూటర్ తరువాత నేను చేసిన చిత్రమిది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్. తప్పకుండా అందరికి నచ్చే చిత్రం ఇది.. అన్నారు. 

4. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ ‘ఆక్సిజన్’

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సందర్భంగా...

నిర్మాత ఎస్‌.ఐశ్వ‌ర్య మాట్లాడుతూ..గోపీచంద్ హీరోగా మేం రూంపొందిస్తున్న ఆక్సిజ‌న్ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 90 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అలాగే చిత్రీక‌ర‌ణ‌కు స‌మాంత‌రంగా డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగున్నాయి. ఇప్ప‌టి వర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో సినిమా చేస్తున్నాం. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. సెప్టెంబ‌ర్ నెల‌లో ఆడియో విడుద‌ల చేసి అదే నెల‌లో సినిమాను కూడా ప్రేక్ష‌కులు ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌,  ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ