విడుదలకు ముస్తాబవుతున్న నాగచైతన్య అక్కినేని 'ప్రేమమ్'
నాగచైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో.. దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.
చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ....చిత్రంలోని తొలిపాటను ఈ నెల 18న ఎఫ్.ఎమ్ లలో విడుదల చేస్తున్నాము. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా విడుదల చేయనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.
ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి