Advertisementt

'బాబు బంగారం' రోజే.. 'బొమ్మ‌ల రామారం'!

Tue 02nd Aug 2016 04:23 PM
bommala ramaram,august 12th release,bommala ramaram release date,nishanth pudari  'బాబు బంగారం' రోజే.. 'బొమ్మ‌ల రామారం'!
'బాబు బంగారం' రోజే.. 'బొమ్మ‌ల రామారం'!
Advertisement
Ads by CJ

మేడియవాల్‌ స్టోరీ టెల్లర్స్‌ సమర్పణలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బొమ్మల రామారం'. నిషాంత్‌ దర్శకత్వంలో పుదారి అరుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర నిర్మాత పుదారి అరుణ మాట్లాడుతూ..సినిమా చాలా బాగా వ‌చ్చింది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఉన్న‌వాడికి లేనివాడికి మ‌ధ్య ఓ అంత‌రం, పోరాటం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో జ‌రుగుతూనే ఉంటుంది. దాన్ని ఓ గ్రామ నేపథ్యంలో చెప్ప‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ బొమ్మ‌ల రామారం. ద‌ర్శ‌కుడు నిషాంత్ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిగా తెర‌కెక్కించారు. ఇందులో ఓ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో పాటు చెడుపై మంచి ఎప్ప‌టికైనా విజ‌యాన్ని సాధిస్తుంద‌నే చ‌క్క‌టి మెసేజ్ కూడా చెప్పాం. అంతే కాకుండా ఈ సినిమాలో ఉన్న మొస‌లి ఫైట్ సినిమాకు చాలా హైలైట్ అవుతుంది.  ఈ సినిమా ద్వారా 50 న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. కమర్షియల్‌ సినిమాల స్టయిల్‌లో ఉండే మంచి సందేశాత్మ‌క చిత్ర‌మిది. ప్ర‌ముఖ గాయ‌ని సుశీల‌గారు ఈ చిత్రంలో పాడిన పాట హైలైట్ అవుతుంది. అలాగే అన్నీ పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఈ చిత్రంలోని నటీనటులు, టెక్నికల్‌ టీం ఎఫర్ట్‌ బావుంది. స‌పోర్ట్ చేసిన‌ అందరికీ థాంక్స్‌. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 12న విడుద‌ల‌వుతుంది.. అన్నారు. 

తిరువీర్‌, సంకీర్తన, ప్రియదర్శి, విమల్‌ కృష్ణ, మోహన్‌ భగత్‌, గుణకర్‌, శివ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్‌: సుధీర్‌కుమార్‌, ఆర్ట్‌: కృష్ణ మాయ, ఎడిటర్‌: శివ శ్రీనివాస్‌, మ్యూజిక్‌: కార్తీక్‌ కొడకండ్ల, శ్రవణ్‌ మైకేల్‌, సినిమాటోగ్రఫీ: బి.వి.అమర్‌నాథ్‌ రెడ్డి, నిర్మాత: పుదారి అరుణ, రచన, దర్శకత్వం: నిషాంత్‌ పుదారి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ