'మనమంతా' లాంటి ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది - మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్
విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి ప్రధానపాత్రల్లో సాయికొర్రపాటి, వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం 'మనమంతా'-One World, Four Stories. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ...
మోహన్ లాల్ మాట్లాడుతూ...మనమంతా నా పుల్ లెంగ్త్ తెలుగు చిత్రం. అంతే కాకుండా ఫస్ట్ టైమ్ నేను తెలుగులో డబ్బింగ్ చెప్పిన సినిమా. 7 రోజుల్లో 68 గంటలు తెలుగుపై అవగాహన పెంచుకుని డబ్బింగ్ చెప్పాను. ఇలా తెలుగులో డబ్బింగ్ చెప్పడం నాకు చాలా హ్యపీగా అనిపించింది. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చాలా బాగా వచ్చింది. డబ్బింగ్ చెప్పే సమయంలో రియల్ లైఫ్‌లో నన్ను నేను తెరపై చూసుకున్నట్లు అనిపించింది. నేనే కాదు ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికీ వారి గతం గుర్తుకు వస్తుంది. ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతారు. నా క్యారెక్టర్, గౌతమి క్యారెక్టర్, విశ్వాంత్, రైనారావు క్యారెక్టర్స్ తో పాటు అన్నీ రోల్స్ చాలా చక్కగా వచ్చాయి. చూసే ఆడియెన్స్ కొత్త ఫీల్‌కు లోనవుతారు. సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో క్లీన్ యు సర్టిఫికేట్ సంపాదించుకుందంటేనే అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసే చిత్రమని తెలుస్తుంది. సినిమా ఆగస్టు 5న విడుదలవుతుంది. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు మనమంతా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.