యంగ్ హీరో సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్ చిల్). ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సుశాంత్, సోనమ్ ప్రీత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, ఛీఫ్ కో-డైరెక్టర్. డి.సాయికృష్ణ, కో-డైరెక్టర్: కొండా ఉప్పల, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి, కథ-మాటలు: శ్రీధర్ సీపాన, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.