Advertisementt

ఈ 'అభినేత్రి' కోసం ఆ 'అభినేత్రి'!

Wed 06th Jul 2016 02:43 PM
sridevi,abhinetri movie,abhinetri audio launch details,prabhu deva,kona venkat,sridevi guest for abhinetri audio  ఈ 'అభినేత్రి' కోసం ఆ 'అభినేత్రి'!
ఈ 'అభినేత్రి' కోసం ఆ 'అభినేత్రి'!
Advertisement
Ads by CJ

ఆలిండియా స్టార్‌ శ్రీదేవి ముఖ్య అతిథిగా ప్రభుదేవా, తమన్నా 'అభినేత్రి' ఆడియో ఫంక్షన్‌ 

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆగస్ట్‌ 15న విజయవాడలో చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా ఆలిండియా స్టార్‌ శ్రీదేవిని తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయవాడలో ఫంక్షన్‌ జరిగే లొకేషన్‌కు డైరెక్ట్‌గా హెలికాప్టర్‌ ద్వారా తీసుకొచ్చేందుకు చిత్ర సమర్పకులు కోన వెంకట్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ - 'తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌ కలిసి మొదటిసారిగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆగస్ట్‌ 15న విజయవాడలో చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. అభినేత్రిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఆలిండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీదేవిగారిని ఈ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రభుదేవా, తమన్నాల ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌తో డైరెక్టర్‌ విజయ్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇండియాలోని టాప్‌ టెక్నీషియన్స్‌తో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం'.. అన్నారు. 

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - 'ప్రభుదేవా, తమన్నా వంటి టాప్‌ ఆర్టిస్టులతో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా వుంది. టీజర్‌కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ ఈ చిత్రంపై మాకు వున్న నమ్మకాన్ని రెట్పింపు చేసింది. ఫస్ట్‌ టైమ్‌ తమన్నా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం ఆర్టిస్టుగా ఆమెకు చాలా మంచి పేరు తెస్తుంది. ఈ చిత్రంలో ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. శ్రీదేవిగారు ముఖ్య అతిథిగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఆగస్ట్‌ 15న విజయవాడలో జరుపుతున్నాం. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తేవడమే కాకుండా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'.. అన్నారు. 

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ