Advertisementt

పూరి, కళ్యాణ్‌రామ్‌ల 'ఇజం' ఇది..!

Mon 04th Jul 2016 07:48 PM
ism,puri jagannadh,kalyan ram,kalyan ram birthday special,ism movie first look,ijam  పూరి, కళ్యాణ్‌రామ్‌ల 'ఇజం' ఇది..!
పూరి, కళ్యాణ్‌రామ్‌ల 'ఇజం' ఇది..!
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ మూవీ 'ఇజం' సెప్టెంబర్‌ 29 విడుదల 

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. జూలై 5 డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ 'ఇజం' టైటిల్‌ను ఎనౌన్స్‌ చేసి, ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఆగస్ట్‌ 9 నుంచి నెలాఖరు వరకు స్పెయిన్‌లో భారీ షెడ్యూల్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ...పూరిగారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, పూరిగారితో చేస్తున్న 'ఇజం' చిత్రం మరో ఎత్తు. ఒక డిఫరెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది.. అన్నారు. 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ...ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్తగా.. చాలా కొత్తగా కనిపిస్తాడు. జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే చిత్రమిది. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్‌ సినిమా ఇది..అన్నారు. 

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ