Advertisementt

'అత్తారిల్లు' కి బ్యాగ్రౌండ్ మ‌ణిశ‌ర్మ వున్నాడు!

Sat 02nd Jul 2016 05:38 PM
atharillu,attarillu audio launch,anjan k kalyan,manisharma,tammareddy bharadwaja,athithi,sai,atharillu audio launch matter  'అత్తారిల్లు' కి బ్యాగ్రౌండ్ మ‌ణిశ‌ర్మ వున్నాడు!
'అత్తారిల్లు' కి బ్యాగ్రౌండ్ మ‌ణిశ‌ర్మ వున్నాడు!
Advertisement
Ads by CJ

అంజన్‌ కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  అంజన్ కె. కళ్యాణ్  స్వీయ‌ దర్శకత్వం నిర్మిస్తున్న‌ చిత్రం ‘అత్తారిల్లు’. అంతా కొత్త నటీనటులతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం ఆడియో హైద్రాబాద్ ఫిలించాంబ‌ర్ లో  జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తొలి సీడీని ఆవిష్క‌రించారు. 

ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌రద్వాజ మాట్లాడుతూ...రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఏక‌ల‌వ్య శిష్యుడు అంజ‌న్ కె.క‌ళ్యాణ్‌. ఇటీవ‌ల వ‌ర్మ చేసిన ర‌క్త చ‌రిత్ర సినిమాకు క‌ళ్యాణ్ స్టోరీ బోర్డు కూడా వేశాడు. కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర కూడా చాలా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో  ప‌ని చేశాడు. నేను చేసిన ప‌లు టీవీ షోస్ ని కూడా క‌ళ్యాణ్ డైర‌క్ట్ చేశాడు. ఏ పని చేసినా న‌మ్మి చేసే క‌ళ్యాణ్‌..ఈ క‌థ పై న‌మ్మ‌కంతో  త‌నే  నిర్మించుకున్నాడు. ఈ సినిమాకు నేప‌థ్య సంగీతం మ‌ణిశ‌ర్మ చేసాడంటేనే  క‌ళ్యాణ్ ఎంత బాగా సినిమా తీసాడో అర్ధ‌మ‌వుతోంది. త‌న గురువుల్లాగే త‌ను కూడా ద‌ర్శ‌కుడుగా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటూ.. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నాను.. అని అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత అంజన్ కె. కళ్యాణ్‌ మాట్లాడుతూ...టీమ్ అంద‌రి స‌హ‌కారం వ‌ల్లే ఈ సినిమా చేయ‌గ‌లిగాను. కెరీర్ కోసం ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేశారు. ప్ర‌తిభ ఉండి స‌రైన అవ‌కాశాల్లేని వారిలో కొంత మందిని  తీసుకొని ఈ సినిమా చేశా. మ‌ణిశ‌ర్మ గారు ఆర్ ఆర్ తో మా సినిమాను మరో లెవ‌ల్ కి తీసుకెళ్లారు. మా సినిమా న‌చ్చి నేప‌థ్య సంగీతం స‌మ‌కూర్చిన మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌గారికి సర్వదా కృత‌జ్క్షుడిని. కృష్ణ‌వంశీ గారి వ‌ద్ద అంతఃపురం నుంచి మురారి సినిమా వ‌ర‌కు ప‌ని చేశా. ఆ అనుభవం ఈ సినిమాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్ తో పాటు ఆడియ‌న్స్ కి కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ మా చిత్రంలో ఉన్నాయి. క‌థ‌, క‌థ‌నాలు కొత్త‌గా ఉంటాయి.  డెన్నిస్  నార్టన్ రెండు మంచి బాణీలు ఇచ్చారు. మా ఆడియో లాంచ్ కి విచ్చేసిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారికి కృత‌జ్క్ష‌త‌లు. జూలై 15న సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. అన్ని సినిమాల్లాగే మా సినిమాని కూడా ఆద‌రిస్తారని ఆశిస్తున్నాను.. అన్నారు

సంగీత ద‌ర్శ‌కుడు డెన్నిస్ నార్ట‌న్ మాట్లాడుతూ...అంజ‌న్ కె.క‌ళ్యాణ్ గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. న‌న్ను న‌మ్మి మంచి పాట‌లు చేసే అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.. అని అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాట్లాడుతూ...నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి సినిమా మంచి క్వాలిటీగా రావడానికి స‌హ‌క‌రించిన క‌ళ్యాణ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెస్తుంద‌న్న నమ్మ‌కం ఉంద‌ని.. అన్నారు.

హీరో సాయిర‌వికుమార్ మాట్లాడుతూ...క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ, హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్ తో పాటు యాక్ష‌న్ ల‌వ్, సెంటిమెంట్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ మా `అత్తారిల్లు` చిత్రంలో ఉంటాయి. మా సినిమా అంద‌రూ చూసి బ్లెస్ చేస్తార‌ని కోర‌కుంటున్నా..అని అన్నారు.

హీరోయిన్ అతిథిదాస్ మాట్లాడుతూ...'నా కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర చేసే అవ‌కాశం క‌ల్పించిన మా ద‌ర్శ‌క‌నిర్మాత క‌ళ్యాణ్ గారికి థ్యాంక్స్. టీమ్ అంద‌రూ చాలా బాగా స‌పోర్ట్ చేశారు. డెన్నిస్ సూప‌ర్బ్ మ్యూజిక్ ఇచ్చార‌న్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో నండూరి రాము, రాజ‌శేఖ‌ర్, వినోద్, వంశీరాజు, జోజూ, రాకేష్ శ‌ర్మ‌, త‌దిత‌ర‌లు పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

సాయి రవి కుమార్‌ , అతిథి దాస్‌, అనస్తేశియ చప్రసోవ, నండూరి రాము, రాకేశ్‌ శర్మ, ఉదయ్‌ శరత్‌, జోజూ, ఆర్‌జె వంశీ రామరాజు, ఎక్కాల‌ వినోద్‌ కుమార్‌, రాజేంద్ర పులి, రాజశేఖర్‌, మమత  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌: మణిశర్మ, పాటలు: డెన్నిస్‌ నార్టన్‌, కెమెరా: శివశంకర వరప్రసాద్‌, డాన్స్‌: జోజూ, ఫైట్స్‌: రెబల్‌ మాస్టర్‌, కో-డైరెక్టర్‌: కరణం వి లోకనాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యం.హెచ్‌.రెడ్డి, సమర్పణ: అక్షయ్‌-అశ్విన్‌, కో- ప్రొడ్యూసర్స్‌: కాక‌ల్ల ల‌క్ష్మీ మ‌ల్ల‌య్య,  జ్యోతి. కె. కళ్యాణ్‌,  కథ-స్క్రీన్‌ప్లే-నిర్మాత- దర్శకత్వం: అంజన్‌ కె కళ్యాణ్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ