Advertisementt

ఆగస్టులో 'తిక్క' చూపిస్తాడట!

Mon 27th Jun 2016 07:59 PM
thikka movie,sai dharam tej,suneel reddy,rohin kumar reddy  ఆగస్టులో 'తిక్క' చూపిస్తాడట!
ఆగస్టులో 'తిక్క' చూపిస్తాడట!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, మన్నారా చోప్రా ప్రధాన పాత్రల్లో శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్ పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ సినిమాలోని ప్రత్యేకగీతాన్ని సోమవారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నాం. రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆ రెండు పాటల్లో ఒక పాటను హైద్రాబాద్ లో మరొక పాటను లడక్ లో చిత్రీకరిస్తాం. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''మిగిలిన రెండు పాటల షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాటలు, సినిమా బాగా వచ్చిందనే అనుకుంటున్నాం'' అని చెప్పారు. 

నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమాలో తేజు డాన్సులు అదిరిపోతాయి. ఆడియన్స్ ను ఉత్సాహ పరిచే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఉష ఉతప్, కె.కె పాడిన పాటను ఈరోజు చిత్రీకరిస్తున్నాం'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో తాగుబోతు రమేష్, ప్రేమ్ రక్షిత్, గుహన్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్, మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కథ: షేక్ దావూద్, డైలాగ్స్: లక్ష్మి భూపాల్, ప్రొడ్యూసర్: సి.రోహిన్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ