సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.తాను నిర్మిస్తోన్న చిత్రం 'కబాలి'. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు పా.రంజిత్ విలేకర్లతో ముచ్చటించారు. ''తమిళ, తెలుగు భాషల్లో విడుదలయిన ఈ సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. రజినీకాంత్ గారి కూతురు సౌందర్య నాకు స్నేహితురాలు. తనకు నేను రజినీకాంత్ గారితో పని చేయాలనుండేది. ఒకరోజు తను ఫోన్ చేసి నాన్న కలవమన్నారని చెప్పింది. రజినీకాంత్ గారు నేను డైరెక్ట్ చేసిన 'మద్రాస్' సినిమా చూసి నాతో సినిమా చేయాలనుకున్నారు. ఆ సినిమానే నాకు రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో పని చేసే అవకాశం తెచ్చి పెట్టింది. ఆయనతో పని చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ప్రయత్నించారు. కానీ ఆ అవకాశం నాకు ఇచ్చారు. ఆయనకు యంగ్ డైరెక్టర్స్ తో పని చేయాలంటే ఇష్టం. ఎప్పడూ కొత్తదనాన్ని పరిచయం చేయాలనుకుంటారు. ఈ సినిమాలో రజినీకాంత్ గారు ఓల్డ్ లుక్ లో కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. మిగిలిన సినిమా మొత్తం యంగ్ లుక్ లోనే కనిపిస్తారు. ఆయనకు యంగ్ గా చూపించడానికి 1980 లలో రజినీకాంత్ గారు నటించిన సినిమాల్లో ఫోటోలు రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఆంగ్లేయుల పరిపాలనలో ఇండియా నుండి కొందరిని మలేషియా తీసుకెళ్లి రబ్బర్ ఫ్యాక్టరీలో లేబర్స్ గా పనిలో పెట్టారు. వారికున్న సమస్యలను ఎదిరించడానికి కబాలి అనే వ్యక్తి డాన్ గా మారుతాడు. కబాలి అంటే మాస్ వర్గానికి చెందిన వారిని పిలుస్తుంటారు. రజినీకాంత్ గారు ముళ్ళు మలర్ అనే తమిళ సినిమాలో నటించారు. ఆ సినిమాలో పెర్ఫార్మన్స్ ఎంత టెరిఫిక్ గా ఉంటుందో.. ఆ సినిమాకు మించి ఈ చిత్రంలో నటించారు. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమా తరువాత సూర్య గారితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు.