నాగశౌర్య, సరయు, పరుల్ ప్రధాన పాత్రల్లో లారెన్స్ దాసరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. జి.వి.చౌదరి, నాగరాజ్ గౌడ్ చిత్ర నిర్మాతలు. స్వరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైద్రాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.కళ్యాణ్, ఎన్.శంకర్ లు బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...
సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ''డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రమిది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన లవ్ స్టోరీను సినిమాగా తెరకెక్కించారు. నాగశౌర్య కెరీర్ లో ఇదొక మంచి సినిమా అవుతుంది. దాసరి లారెన్స్ ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించే ఉంటారు. నిర్మాతలు ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో పాటలు బావున్నాయి. కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది'' అని చెప్పారు.
ఎన్.శంకర్ మాట్లాడుతూ... ''నాగరాజ్ గారు తెలంగాణ సాధించడం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. చౌదరి గారు రాయలసీమకు చెందిన వ్యక్తి. వీరివురు కలిసి సినిమాను నిర్మించడం మంచి విషయం. టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా కోసం పని చేశారు. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు లారెన్స్ దాసరి మాట్లాడుతూ.. ''నా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్స్ కి థాంక్స్ . ప్రతి టెక్నీషియన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. స్వరాజ్ మంచి సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.
వేమూరి నాగేశ్వరావు మాట్లాడుతూ.. ''నాగశౌర్య కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.
మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ... ''యూత్ ఫుల్ టైటిల్ తో వస్తోన్న ఈ ప్రేమ కథను ప్రేక్షకులు ఆదరిస్తారనే భావిస్తున్నాను. స్వరాజ్ ఇచ్చిన ప్రతి పాట ఎనర్జిటిక్ గా ఉంది. మంచి టీమ్ కుదిరింది. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.
సాగర్ మాట్లాడుతూ.. ''ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ. మనిషి జతను కోరుకుంటాడని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాలో ప్రతి పాట బావుంది. పాటల్లానే సినిమా కూడా బావుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
కవిత మాట్లాడుతూ.. ''రొమాంటిక్ సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా టైటిల్ కూడా చాలా బావుంది. చౌదరి గారికి సినిమాలు తీయాలనే ప్యాషన్ ఉండేది. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కానున్నారు. డైరెక్టర్ కి, నిర్మాతకు ఈ సినిమాతో మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రామకృష్ణ, జి.హెచ్.ఎం.సి కమీషనర్ జనార్దన్ రెడ్డి, హరినాథరావు తదితరులు పాల్గొన్నారు.