తెలుగు, కన్నడ బాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న హారర్ ఎంటర్టైనర్ చిత్రం తెలుగులో 'శివగామి' అనే పేరుతో కన్నడలో 'నాని' పేరుతో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయన భీమవరం టాకీస్ పతాకంపై 'శివగామి' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబీ సుహాసిని, జై జగదీష్, ప్రధాన పాత్రల్లో నటించారు. అలానే సీనియర్ హీరోయిన్ సుహాసిని ఓ కీలకపాత్ర కనిపించనున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను ఓం సాయి ప్రకాష్ కు అందించారు. ఈ సంధర్భంగా..
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ''తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సక్సెస్ ఫుల్ హారర్ బేస్డ్ ఫిల్మ్స్ చాలానే తీశారు. సుమారుగా 88 సినిమాలు చేసిన 100 చిత్రాల దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ సినిమా ఆయనకు పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ''చిన్న చిత్రాలనగానే గుర్తొచ్చేది రామసత్యనారాయన గారే. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన రిలీజ్ చేస్తోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
ఓం సాయి ప్రకాష్ మాట్లాడుతూ.. ''కర్ణాటక లో సుమారుగా 85 సినిమాలు, తెలుగులో 14 సినిమాలు డైరెక్ట్ చేశాను. కన్నడ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయంటే మొదటగా సంతోషించేది నేనే. రామసత్యనారాయణ గారు రామానాయుడు గారి బాటలో నడుస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''కన్నడలో నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని, నిర్మాత రమేశ్ కుమార్ జైన్ నాతో అసోసియేట్ అయ్యారు. టేస్ట్ ఉన్న నిర్మాతాయన. సుమంత్ అధ్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.
రమేశ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ''గుజరాత్ లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని రామసత్యనారాయణ గారిని కలిశాం. త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమాల ద్వారా డబ్బు వచ్చినా.. రాకపోయినా.. సినిమాలు చేస్తూనే ఉంటాను'' అని చెప్పారు.
దర్శకుడు సుమంత్ మాట్లాడుతూ.. ''తెలుగు, కన్నడ బాషల్లో ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, సంస్కృతి, మోహన్ గౌడ్, మనీష్ ఆర్య తదితరులు పాల్గొన్నారు.