Advertisementt

'తిక్క' మోషన్ పోస్టర్ లాంచ్!

Sat 25th Jun 2016 07:21 PM
thikka motion poster launch,sai dharam tej,suneel reddy,rohin kumar reddy  'తిక్క' మోషన్ పోస్టర్ లాంచ్!
'తిక్క' మోషన్ పోస్టర్ లాంచ్!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్ పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'తిక్క'. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ శనివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా..

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''దర్శకుడు సునీల్ కు తన టాలెంట్ ఏంటో.. నిరూపించుకోవాలని తిక్క ఉంది. రోహిన్ కుమార్ సినిమా మీద, సునీల్ మీద ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారాడు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. తన రెండో హ్యాట్రిక్ ఈ సినిమాతో మొదలుకానుంది'' అని చెప్పారు. 

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి తిక్క ఉన్నట్లే లెక్క. వి.బి.రాజేంద్ర ప్రసాద్ లాంటి అద్భుతమైన నిర్మాత తరువాత నేను చూసిన మరో నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి. ఆర్టిస్ట్స్ కు కష్టం రాకుండా చూసుకున్నాడు. యువ దర్శకులంతా.. నాకోసం కొత్తగా పాత్రలు రాస్తున్నారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాలో ఎంత యాక్షన్ ఉంటుందో.. అంత కామెడీ ఉంటుంది. విపరీతమైన కామెడీ వర్కవుట్ అయింది. హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు'' అని చెప్పారు.

హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. థమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. తను ఇప్పటివరకు చేసిన ఆల్బమ్స్ కు ఈ సినిమా ఆల్బమ్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కెమెరామెన్ గుహన్ గారు నన్ను ఎంతో అందంగా చూపించారు. ఈ సినిమాలో నాది టిపికల్ క్యారెక్టరైజేషన్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. ''సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోకి రాకముందు నుండి నాకు పరిచయం ఉంది. అదృష్టవశాత్తు తనతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. తనం ఫెంటాస్టిక్ ఆల్బమ్ ఇచ్చాడు'' అని చెప్పారు. 

నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చింది. టెక్నీషియన్స్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. మొదట సినిమా రంగంలోకి రావడం అవసరమా.. అనుకున్నాను. కానీ తేజుని కలిసిన తరువాత సినిమా చేయాలనుకున్నాను మరో వారం, పది రోజుల్లో టీజర్ ను విడుదల చేసి, ఆగస్టు లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాం చేస్తున్నాం'' అని చెప్పారు. 

థమన్ మాట్లాడుతూ.. ''మోషన్ పోస్టర్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. త్వరలోనే పాటలను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇదొక ఫ్రెష్ స్క్రిప్ట్. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కొత్తగా ఉంటాయి'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో అలీ, లారిస్సా బొనెసి, మన్నారా చోప్రా, ఫరా కరిమి, హర్షవర్ధన్, భాస్కర్ భట్ల, తాగుబోతు రమేష్, సత్య తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె.వి.గుహన్, మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్.తమన్, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కథ: షేక్ దావూద్, డైలాగ్స్: లక్ష్మి భూపాల్, ప్రొడ్యూసర్: సి.రోహన్ కుమార్ రెడ్డి, దర్శకత్వం: సునీల్ రెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ