Advertisementt

'సుప్రీమ్' యాభై రోజులు పూర్తి చేసుకొంది!

Fri 24th Jun 2016 06:46 PM
supreme movie 50 days funtion,sai dharam tej,dil raju,anil ravipudi  'సుప్రీమ్' యాభై రోజులు పూర్తి చేసుకొంది!
'సుప్రీమ్' యాభై రోజులు పూర్తి చేసుకొంది!
Advertisement

సాయి ధరమ్ తేజ్ హీరోగా 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుప్రీమ్'. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మే 5న విడుదలయిన ఈ చిత్రం ఈరోజుకి యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి షీల్డులను బహూకరించారు. ఈ కార్యక్రమంలో

హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ''వై.వి.ఎస్ చౌదరి గారు నాకు మొదటి అవకాశం ఇచ్చినా.. పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. వరుసగా దిల్ రాజు గారి బ్యానర్ లో మూడు సినిమాలు చేశాను. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాకు యాభై రోజుల ఫంక్షన్ చేసుకున్నాం. మళ్లీ ఈ సినిమాకు యాభై రోజుల కార్యక్రమం జరుపుకుంటున్నాం. అనిల్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. యాక్షన్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పాత్ర. సాయి కార్తిక్ మ్యూజిక్ ఇరగదీసాడు. సాయి శ్రీరామ్ గారు ఎంతో అందంగా కాప్చ్యూర్ చేశారు. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని చెప్పారు. 

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''కథ విని అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువయినా.. నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థాంక్స్. సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ నా మీద ప్రేమతో పని చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప నటుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేస్తాను. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

దిల్ రాజు మాట్లాడుతూ.. ''కెరీర్ మొదట్లో వచ్చే సక్సెస్ ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఆ సమయంలో వచ్చే షీల్డులను పదిలంగా దాచుకుంటాం. సాయి కెరీర్ లో యాభై రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా ఈ షీల్డు తనకు గుర్తుండిపోతుంది. అనిల్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సమ్మర్ లో జెన్యూన్ హిట్ సినిమా ఇది'' అని చెప్పారు. 

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''తెలుగు సినిమాల్లో ఒక సినిమా ఇన్ని రోజులు ఆడుతుందనే లెక్కపోయింది. ఇప్పుడున్న మార్కెట్ విధానం మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోవడం సంతోషకరమైన విషయం. అనిల్ రెండో సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సాయి ఎంతో చక్కగా నటించాడు. చాలా సెన్సిటివ్ గా ఉంటాడు'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యకమంలో రఘుబాబు, శేషు, రాఘవ, శ్రీనివాస్ రెడ్డి, జె.పి,  యూనిట్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement