Advertisementt

కట్టప్ప ఇకపై 'దొర' అట!

Wed 22nd Jun 2016 12:21 PM
dora audio launch,sathyaraj,sibiraj,dharani dharan  కట్టప్ప ఇకపై 'దొర' అట!
కట్టప్ప ఇకపై 'దొర' అట!
Advertisement
Ads by CJ

సత్యరాజ్, సిబిరాజ్, బిందు మాదవి ప్రధాన పాత్ర్రల్లో రూపొందిన తమిళ చిత్రం 'జాక్స‌న్ దురై'. దర్శకుడు  ధ‌ర‌ణీధ‌ర‌న్. నిర్మాత జక్కం జవహర్ బాబు 'దొర' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైద్రాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో జరిగింది. సురేష్ బాబు, సత్యరాజ్ కలిసి బిగ్ సీడీను రిలీజ్ చేయగా.. సత్యరాజ్ ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీని సిబిరాజ్ కు అందించారు. ఈ సందర్భంగా..

సత్యరాజ్ మాట్లాడుతూ.. ''ఇదొక పీరియాడికల్ హార్రర్ ఎంటర్టైనర్ సినిమా. థ్రిల్లర్, కామెడీ అంశాలు కలగలిపి ఉండే చిత్రం. పేట్రియాటిజం ఉంటుంది. సినిమా మేకింగ్ చాలా బావుంటుంది. 38 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. అయితే ఇప్పుడు అందరూ నా ఒరిజినల్ పేరు మర్చిపోయి, కట్టప్ప అని పిలుస్తున్నారు. ఈ సినిమా తరువాత దొర అని పిలవడం మొదలుపెడతారు'' అని చెప్పారు. 

సిబిరాజ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. మొదటిసారిగా హార్రర్ సినిమాలో నటించాను. అంతేకాదు మొదటిసారి నా సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు రిలీజ్ అవుతోంది. స్క్రిప్ట్ కొత్తగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాన్న గారి కెరీర్ లో బాహుబలి సినిమా తరువాత మరో మైల్ స్టోన్ ఈ సినిమా అవుతుంది'' అని చెప్పారు. 

దర్శకుడు ధరణీధరన్ మాట్లాడుతూ.. ''తెలుగులో పని చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. నా సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఈ సినిమాకు పని చేశారు. సిద్ధార్థ్ మంచి పాటలను అందించాడు. శశాంక్ మాటలు సినిమాకు ప్లస్ అవుతాయి. అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. పాటలు, సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

తమిళ నిర్మాత శరవణన్ మాట్లాడుతూ.. ''సత్యరాజ్ గారు కట్టప్ప పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మొదటిసారి దయ్యం పాత్రలో నటించారు. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అని చెప్పారు.

జక్కం జవహర్ బాబు మాట్లాడుతూ... ''చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్స్ లో, తండ్రి పాత్ర‌ల్లో స‌త్య‌రాజ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌మిళంలో ఓ పీరియాడిక‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టించారు. తెలుగు, త‌మిళంలో జులై 1న‌ ఏకకాలంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సిద్ధార్థ్ విపిన్ చాలా మంచి బాణీల‌ను అందించారు'' అని చెప్పారు. 

సంగీత దర్శకుడు సిద్ధార్థ్ విపిన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉంటాయి. ప్రతి పాటకు మంచి సాహిత్యం కుదిరింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సిబిరాజ్, సత్యరాజ్ లు బాగా నటించారు'' అని చెప్పారు. 

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''టెక్నీకల్ వాల్యూస్ పీక్ లో ఉన్నాయి. టీజర్, సాంగ్స్ బావున్నాయి. ఖచ్చితగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది'' అని చెప్పారు. 

చంద్రబోస్ మాట్లాడుతూ.. ''అనువాద గీతాల్లో కూడా మన వాదన వినిపించడానికి ప్రయత్నించాను. పాటలు, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

ఈ సినిమాకు కెమెరా: యువ‌రాజ్‌, సంగీతం: సిద్ధార్థ్ విపిన్‌, నేప‌థ్య సంగీతం: చిన్నా, పాట‌లు: వెన్నెల‌కంటి, చంద్ర‌బోస్‌, మాట‌లు: శ‌శాంక్ వెన్నెల‌కంటి, ద‌ర్శ‌క‌త్వం: ధ‌ర‌ణీధ‌ర‌న్‌, నిర్మాత‌: జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ