దిల్ రాజు సమర్పకుడిగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం 'రోజులు మారాయి'. మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మురళీకష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.బి. సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఈ రోజు జేఆర్ సిలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దిల్ రాజు తొలి సీడీని ఆవిష్కరించి టీమ్ అందరికీ అందించారు.
అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ... ''మారుతి వల్ల ఈ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించా. సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇటీవల చూశాను. మారుతి నాకేదైతే చెప్పాడో దర్శకుడు అది తెరపై చూపించాడు. నటీనటులందరూ చాలా బాగా నటించారు. జెబి పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. జూలై 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు.
చిత్ర దర్శకుడు మురళీకృష్ణ ముడిదాని మాట్లాడుతూ... ''మంచి కథ, స్ర్కీన్ ప్లే అందించిన మారుతి గారికి ముందుగా థ్యాంక్స్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కత రూపొందింది. భలే భలే మగాడివోయ్ సినిమాకంటే ముందు ఈ సినిమాను ఆయన చేద్దామనుకున్నారు. కానీ ఆ కథను నాకు ఇచ్చి నన్ను దర్శకుడిని చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.
సంగీత దర్శకుడు జెబి మాట్లాడుతూ ... ''మంచి పాటలు సమకూరాయి. ఇంత మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్'' అని తెలిపారు.
చేతన్ మాట్లాడుతూ...''మా నాన్నగారు కారణం నేను సినిమాల్లోకి రావడానికి కారణం. దిల్ రాజుగారు నాపై నమ్మకం పెట్టుకున్నందుకు ఆయకు థాంక్స్. దర్శకుడు మురళి గారు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు'' అని చెప్పారు.
పార్వతీశం మాట్లాడుతూ...''దిల్ రాజు గారు నాకు కేరింత చిత్రంతో బ్రేక్ నిచ్చారు. ఈ చిత్రంలో మంచి పాత్ర చేసే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ....''ఒక ఆర్టికల్ నుండి పుట్టిన కథ ఇది. దర్శకుడు చాలా బాగా ఎడాప్ట్ చేసుకుని చక్కటి సినిమాగా మలిచారు. ఇటీవల సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యా. నేను కథ రాసుకున్నదానికంటే కూడా చాలా బాగా తీసారు. దర్శకుడు చాలా హార్డ్ వర్కర్. జెబిగారు పాటలు చాలా బాగున్నాయి. దిల్‌రాజుగారితో కలిసి చేస్తున్న తొలి సినిమా. సినిమా ఎలా వస్తుందోనని భయముండేది. కానీ చూసిన తర్వాత చాలా హ్యపీగా ఉంది. నటీనటులందరూ చాలా బాగా నటించారు. నిర్మాత శ్రీనివాస్ కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాసర్లశ్యామ్, జి.నాగేశ్వరరెడ్డి, సాయిరాజేష్, డార్లింగ్ స్వామి, హవీష్, రాధాకృష్ణ, హీరో రోహిత్, అనీల్ రావిపూడి, కృతిక, తేజస్వి తదితరులు పాల్గొని చిత్ర విజయం సాధించాలని ఆకాక్షించారు.
చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజశ్వి, ఆలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర,వాసు ఇంటూరి, జబర్దస్త్ అప్పారావు, శశాంక్, రావిపల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మధుసుదనరావు,హర్ష, సంధ్యజనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ,స్క్రీన్‌ప్లే- మారుతి, సమర్పణ- దిల్ రాజు, సంగీతం- జె.బి, మాటలు- రవి నంబూరి, దర్శకత్వం- మురళి కృష్ణ ముడిదాని