Advertisementt

ఆ ముగ్గురు చుట్టూ తిరిగే కథే 'ప్రేమికుడు'!

Fri 17th Jun 2016 10:32 AM
premikudu movie,manas,kala sandeep,june 17th release  ఆ ముగ్గురు చుట్టూ తిరిగే కథే 'ప్రేమికుడు'!
ఆ ముగ్గురు చుట్టూ తిరిగే కథే 'ప్రేమికుడు'!
Advertisement
Ads by CJ

మానస్.ఎన్, సనమ్ శెట్టి జంటగా డిజిపోస్టర్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీ నారాయణరెడ్డి, సునీల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ప్రేమికుడు'. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో మానస్ మాట్లాడుతూ.. ''చైల్డ్ ఆర్టిస్ గా చాలా సినిమాల్లో నటించాను. 2004లో నంది అవార్డు కూడా అందుకున్నాను. ఆ తరువాత 'గ్రీన్ సిగ్నల్','కాయ్ రాజా కాయ్' వంటి చిత్రాల్లో నటించాను. అయితే మొదటిసారిగా సోలో హీరోగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పేరు శ్రీ. హీరో, హీరోయిన్, విలన్ ల చుట్టూ తిరిగే కథ ఇది. విలేజ్ లో ఉండే శ్రీ అనే కుర్రాడు జాబ్ కోసం సిటీకు వస్తాడు. అక్కడ తనకు ఓ అమ్మాయి పరిచయమవుతుంది. తనకున్న సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేసి తన ప్రేమను దక్కించుకున్నాడనేదే ఈ సినిమా కథ. డైరెక్టర్ కళాసందీప్ నాకు ఏడేళ్ళుగా తెలుసు. సినిమా కథ చెప్పగానే గ్రిప్పింగ్ గా అనిపించింది. అవుట్ పుట్ కూడా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, నెల్లూరు, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. రేపే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం 'డీల్ విత్ ధనలక్ష్మీ' అనే చిత్రంలో నటిస్తున్నాను. అలానే కృష్ణవంశీ గారి 'నక్షత్రం' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి ఒప్పుకున్నాను'' అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ