Advertisementt

నీహారికతో డేట్ చెయ్యట్లేదు: నాగశౌర్య

Thu 16th Jun 2016 09:08 PM
nagashourya,oka manasu,niharika,sukumar  నీహారికతో డేట్ చెయ్యట్లేదు: నాగశౌర్య
నీహారికతో డేట్ చెయ్యట్లేదు: నాగశౌర్య
Advertisement
Ads by CJ

నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'ఒక మనసు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య విలేకర్లతో ముచ్చటించారు. 

''నిన్ననే సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సింగిల్ కట్ కూడా లేకుండా 'యు' సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాలో నేను సూర్య అనే పాత్రలో కనిపిస్తాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర. అప్ కమింగ్ పాలిటిషన్ ఎన్ని స్ట్ర గుల్స్ ఫేస్ చేశాడనే విషయాలు ఈ సినిమాలో డిస్కస్ చేశాం. రాజకీయాల నేపధ్యంలో సాగే ప్రేమ కథ. డైరెక్టర్ గారికి కథ పట్ల ఎంతో క్లారిటీ ఉంది. నీహారికతో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేశాను. మొదట చాలా భయపడ్డాను. పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్, నన్ను పట్టించుకోరనుకున్నాను. కాని చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. అయితే తనతో నేను డేటింగ్ చేస్తున్నాననే వార్తలు వినిపించాయి. అవి రూమర్స్ మాత్రమే. నేను ఏ హీరోయిన్ తో వర్క్ చేసిన తనతో డేట్ చేస్తున్నానని రాస్తున్నారు. మొన్నటివరకు రాశిఖన్నా, సొనారిక, ఇప్పుడేమో నీహారిక అంటున్నారు.   నాకు అనుష్క అంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాను. మరి తనతో ఎఫైర్ ఉందని ఎందుకు రాయలేదో..?. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం 'జో అచ్చ్యుతానంద' సినిమాలో నటిస్తున్నాను. 65% షూటింగ్ పూర్తయింది. అలానే సుకుమార్ గారి ప్రొడక్షన్ లో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించాను'' అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ