మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబీ సుహాసిని, జై జగదీష్ ప్రధాన పాత్రల్లో రమేష్ కుమార్ జైన్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'శివగామి'. దర్శకుడు సుమంత్. కన్నడలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రతాని రామకృష్ణ గౌడ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ''కన్నడలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో డబ్ చేస్తున్నాం. ఈ సినిమాలో సీనియర్ సుహాసిని గారు కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 24న తెలుగు, కన్నడ భాషల్లో ఒకేరోజున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హారర్ సినిమాల్లో 'శివగామి' సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందనే నమ్మకముంది'' అని చెప్పారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''భీమవరం టాకీస్ పతాకంపై రామసత్యనారాయణ గారు ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. శివగామి కూడా మరో మంచి చిత్రమవుతుంది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది'' అని చెప్పారు.
రసమయి బాలాకిషణ్ మాట్లాడుతూ.. ''సినిమాల్లో చిన్న, పెద్ద అని ఉండవు. మంచి చిత్రం, చెడ్డ చిత్రమనే ఉంటాయి. మంచి కంటెంట్ తో వచ్చిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ.. ఆదరిస్తూనే ఉంటారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బావుంది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ''కన్నడలో నాని అనే పేరుతో ఈ సినిమా విడుదలవుతుంది. గుజరాత్ సమీపంలో ఓ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో దయ్యాలున్నాయనే కారణంతో 1997 లో మూసివేశారు. ఆ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాను హిందీలో చేయమని మొదట నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్పటికే నేను కన్నడలో నాలుగైదు సినిమాలు చేశాను. అందుకే ఈ సినిమాను కన్నడలోనే చేయాలనుకున్నాను. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు తెలుగులో రిలీజ్ చేస్తామనగానే సంతోషపడ్డాను. ఇకపై తెలుగులో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు సుమంత్ మాట్లాడుతూ.. ''నాకు ఈ అవకాసం ఇచ్చిన నిర్మాత గారికి థాంక్స్. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కవిత, వెంకట్రావు, గజల్ శ్రీనివాస్, సంస్కృతి, భారతి బాబు, అల్లాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సురేష్, సంగీతం: త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా.శివ వై. ప్రసాద్ , సమర్పణ: రమేష్ కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుమంత్.