Advertisementt

'కన్నుల్లో నీ రూపమే' సినిమాకు రాజమౌళి క్లాప్!

Wed 15th Jun 2016 06:30 PM
kannullo nee roopame,bix,nandu,saketh,bhaskar  'కన్నుల్లో నీ రూపమే' సినిమాకు రాజమౌళి క్లాప్!
'కన్నుల్లో నీ రూపమే' సినిమాకు రాజమౌళి క్లాప్!
Advertisement
Ads by CJ

నందు, తేజశ్విని ప్రకాష్ జంటగా బిక్స్ దర్శకత్వంలో భాస్కర్ బసాని నిర్మిస్తోన్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక బుధవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఈ.రాజమౌళి క్లాప్ కొట్టగా, ప్రియాన్ష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బిక్స్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

హీరో నందు మాట్లాడుతూ.. ''బిక్స్ గారు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో డైరెక్షన్ లో కోర్స్ చేశారు. సాఫ్ట్ వేర్ జాబులో పని చేసిన ఆయన సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇదొక కామెడీ, థ్రిల్లర్ మూవీ. నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో నటించలేదు. నేను ఈ సినిమాలో వినూత్నంగా కనిపిస్తాను. నన్ను మరో స్థాయికి తీసుకువెళ్ళే పాత్ర ఇది'' అని చెప్పారు. 

దర్శకుడు బిక్స్ మాట్లాడుతూ.. ''కథ వినగానే నచ్చి నన్ను ప్రోత్సహిస్తోన్న నిర్మాత గారికి థాంక్స్. ఈ సినిమాలో హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 80% కామెడీ ఉంటుంది. సినిమా మొత్తం కామెడీ, ఎమోషన్స్ తో నడుస్తుంటుంది. రెండు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేసి కేరళలో  సినిమా పాటలను చిత్రీకరించాలనుకుంటున్నాం'' అని చెప్పారు. 

నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ.. ''ఇది మా ప్రొడక్షన్ లో వస్తోన్న మొదటి సినిమా. రేపటి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి మొదటి షెడ్యూల్ ను 10 రోజుల్లో పూర్తి చేసి జూలై లో రెండో షెడ్యూల్ ను ప్రారంభించి ఆగస్ట్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. లవ్, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా'' అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాను. సినిమాలో మొత్తం మూడు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి'' అని చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: ఎన్.బి.విశ్వకాంత్, కో డైరెక్టర్: బి.డి. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ప్రేమ్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్, నిర్మాత: భాస్కర్ బసాని, కథ-స్క్రీన్ ప్లే- డైలాగ్స్-దర్శకత్వం: బిక్స్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ