Advertisementt

మరో భయపెట్టే చిత్రంలో నయనతార!

Tue 14th Jun 2016 07:56 PM
nayanthara,horror movie,malkapuram sivakumar,murugadasu ramadasu director,nayanthara movies  మరో భయపెట్టే చిత్రంలో నయనతార!
మరో భయపెట్టే చిత్రంలో నయనతార!
Advertisement
Ads by CJ

నయనతారతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా హారర్ చిత్రం!

తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న నయనతార ప్రధాన తారగా ఓ హారర్ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నయనతార నటించనున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో నయనతార పాత్ర ఆసక్తికరంగా వుంటుంది. ఉత్కంఠను కలిగించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తుంది. ఈ నెల 18 నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. మా సంస్థలో విభిన్నమైన సినిమాలను రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ