Advertisementt

ఆసక్తికర కథనంతో 'మీకు మీరే మాకు మేమే'!

Tue 14th Jun 2016 07:43 PM
hussain sha kiran,meku mere maaku meme,sravan  ఆసక్తికర కథనంతో 'మీకు మీరే మాకు మేమే'!
ఆసక్తికర కథనంతో 'మీకు మీరే మాకు మేమే'!
Advertisement
Ads by CJ

తరుణ్ శెట్టి, అవంతిక ప్రధాన పాత్రల్లో నాకామా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై హుస్సేన్ షా కిరణ్ రూపొందిస్తోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ విలేకర్లతో ముచ్చటించారు. '8 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేసి సినిమాల మీద మక్కువతో షార్ట్ ఫిల్మ్స్ చేశాం. ఆ లఘు చిత్రాలను చూసిన అల్లు అరవింద్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. సుకుమార్ గారిని పరిచయం చేసి ఆయన దగ్గర పని చేసే అవకాసం కల్పించారు. సినిమా చేయాలనుకొని అరవింద్ గారిని కొన్ని సలాహాలు అడిగాం. కొందరు స్నేహితులతో కలిసి నేనే సినిమా నిర్మించాలనుకున్నాను. కాని అల్లు అరవింద్ గారి ప్రోత్సాహంతో మా సినిమాకు ఫండ్ చేసేవాళ్ళు దొరికారు. ఆయన ఆర్తికంగానే కాదు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. ఒక ఇమ్మెచ్యూర్ అబ్బాయికి, ఒక మెచ్యూర్డ్ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ సినిమా. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. ఆసక్తికరమైన కథనంతో నడుస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు రాలేదని నమ్మకంతో చెప్పగలను. ఆర్టిస్ట్స్ అందరు ఎంతో సిన్సియర్ గా పని చేశారు. ఇది నా డెబ్యూ ఫిలిం. ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే సినిమా పాటలకు మంచి స్పందన లభించింది. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జూన్ 17న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నా తదుపరి సినిమా పెద్ద బ్యానర్ లో పెద్ద హీరోతో ఉంటుంది'' అని చెప్పారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ