Advertisementt

తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో 'త్యాగాల వీణ'!

Mon 13th Jun 2016 06:19 PM
tyagala veena movie,suman,miriyala ravikumar  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో 'త్యాగాల వీణ'!
తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో 'త్యాగాల వీణ'!
Advertisement
Ads by CJ

సుమన్, శివకృష్ణ, ప్రీతీనిగమ్, మధుబాల ప్రధాన పాత్రల్లో ప్రేమా మూవీస్ బ్యానర్ పై, తుమ్మల రమేష్ రెడ్డి సమర్పణలో కొత్తపల్లి సతీష్ బాబు నిర్మిస్తోన్న తెలంగాణా ఉద్యమ చిత్రం 'త్యాగాల వీణ'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..

స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ''తెలంగాణా ఉద్యమం స్ఫూర్తి వంతమైనది. ఎందరో వీరులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధమయ్యారు. ఆ పోరాట ఉద్యమాల నేపధ్యంలో 'త్యాగాల వీణ' అనే చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ''తెలంగాణా సమస్తం త్యాగాలతో కూడుకున్నది. ఎందరో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణా. ఆ నేపధ్యంలో సినిమా చేయడమనేది మంచి విషయం. ఈ సినిమాను అందరు ఆదరించాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇప్పటికే ఈ సినిమా 90% పూర్తయింది. ఈ సినిమాకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయం అందుతుంది. ఈ చిత్రానికి ఎటువంటి రాయితీ లేకుండా చేస్తాం'' అని చెప్పారు. 

దర్శకుడు మిరియాల రవికుమార్ మాట్లాడుతూ.. ''ఏ దేశంలోనూ ఒక రాష్ట్రం కోసం ఇన్ని ఆత్మ బలిదానాలు జరగలేదు. ఈ తెలంగాణా చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం ఇవ్వాలని భావిస్తున్నాం'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కో డైరెక్టర్: మువ్వా, సంగీతం: రమేష్ ముక్కెర, కెమెరా: డి. యాదగిరి, ఎడిటర్: గడ్డం.సంతోష్, నిర్మాత: కొత్తపల్లి సతీష్ బాబు, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మిరియాల రవికుమార్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ