జస్ట్ టైమ్ గ్యాప్ అంతే... టైమింగ్‌లో గ్యాప్ ఉండదు...మెగాస్టార్ చిరంజీవికి ఈ డైలాగ్ కరెక్ట్‌గా సరిపోతుంది. సినిమాలకు ఎంత దూరంగా వన్స్ ఫీల్డ్‌లో దిగితే రఫ్పాడించమే అన్నట్లు ఉంది ఆయన జోరు చూస్తుంటే. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సిని మా అవార్డ్సు వేడుకలో గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు చిరు స్టెప్పులేశారు. ఆయనతోపాటు శ్రీకాంత్, సాయిధరమ్ తేజ్, సునీల్ తదితరులు కూడా కాలు కదిపారు. వయసు మీద పడిన డాన్స్‌లు ఈజ్, ఆ కరిష్మ ఏమాత్రం తగ్గలేదని వీక్షకులు చెబుతున్నారు. చిరు వేసే స్టెప్పులకి ఆడిటోరియంలో ప్రేక్షకులతో ఉత్సాహంతో ఈలలు, కేకలతో హల్‌చల్ చేశారు. 150వ సినిమాకు ఆయన బాగానే కసరత్తులు చేస్తున్నట్లు చిరు ఉత్సాహం చూస్తుంటే తెలుస్తుంది. చిరు స్టెప్పులు చూశాక అక్కడివారంతా అన్నయ్యా మజాకా అని అనుకున్నారు.