Advertisementt

చిన్న సినిమాకు సుకుమార్ సపోర్ట్!

Sat 11th Jun 2016 01:40 PM
control c movie,sukumar,sairam challa,prabhakar reddy  చిన్న సినిమాకు సుకుమార్ సపోర్ట్!
చిన్న సినిమాకు సుకుమార్ సపోర్ట్!
Advertisement

అశోక్, దిశా పాండే జంటగా సెకండ్ ఇండిపెండన్స్ టాకీస్ బ్యానర్ పై సాయిరాం చల్లా దర్శకత్వంలో 

ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'కంట్రోల్ సి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..

సుకుమార్ మాట్లాడుతూ.. ''చిన్న సినిమా నేను వార్న్ చేస్తున్నా.. ఖర్చుకు వెనుకాడకుండా ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. సాయిరాం చల్లా ఎన్నో ఏళ్ళుగా నాకు తెలుసు. సాఫ్ట్ వేర్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేసేవాడు. అంత పెద్ద ఉద్యోగం వొదిలేసి డైరెక్టర్ అవ్వాలని నా దగ్గరకు వచ్చి ఓ స్టొరీ చెప్పాడు. అదొక భారీ బడ్జెట్ సినిమా అని మొదట ఒక చిన్న సినిమా చేయమని చెప్పాను. ట్విన్ టవర్స్ ను ఇతివృత్తంగా తీసుకొని, సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీశారు. కొత్త డైరెక్టర్ అని ఒక్క ఫ్రేములో కూడా అనిపించలేదు. పదేళ్ళ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను రూపొందించారు. తను ఆర్టిస్టులను డీల్ చేసిన విధానం అధ్బుతం. సినిమాలో నైట్ ఎఫెక్ట్స్ చాలా బాగా చూపించారు. చిన్న సినిమాను విజువల్ గా అధ్బుతంగా చూపించడమనేది గొప్ప విషయం'' అని చెప్పారు. 

దర్శకుడు సాయిరాం చల్లా మాట్లాడుతూ.. ''సుకుమార్ గారి ఆర్య సినిమా చూసి నేను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. 2004 నుండి ఆయనతో కలిసి జర్నీ చేశాను. నా ప్రతి స్టేజ్ లో ఆయనెంతో ప్రోత్సహించారు. పెద్ద సినిమా చేయాలనుకున్నాను కాని సుకుమార్ గారి సలహాతో మొదట చిన్న సినిమాతో ప్రారంభించాను. ఆయనకు ఈ సినిమా లైన్ చెప్పగానే నచ్చింది. దాన్ని కథగా డెవలప్ చేశాను. ఇండియన్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ఫార్మాట్ ఈ సినిమాలో ఉండదు. ఈ సినిమాకు కథే హీరో. కథే పాత్రలను నడిపిస్తుంది. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అందులో నుండి బయటపడ్డ ఓ ప్రేమ జంటకు సీడీ దొరకుతుంది. ఆ సీడీ వారి జీవితాల్లో ఎటువంటి మార్పులను తీసుకువచ్చిందనేదే సినిమా. ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ. జూన్ 17న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు రిలీజ్ చేస్తున్నారు'' అని చెప్పారు.  

నిర్మాత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''బిగ్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇదొక సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ మూవీ. మాకు సినిమా ఇండస్ట్రీలో అనుభవం లేదు. మా వెన్నంటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేసిన సుకుమార్ గారికి కృతజ్ఞతలు'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సమీర్, చంద్రమహేష్, బెనర్జీ, హేమ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్: అచ్చు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: చంద్రమౌళి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, దర్శకుడు: సాయిరాం చల్లా, నిర్మాత: ప్రభాకర్ రెడ్డి.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement