వికాష్, కళ్యాణి, రేష్మ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి ఫిలిం మేకర్స్ పతాకంపై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరావు నిర్మిస్తోన్న చిత్రం 'తుహిరే మేరి జాన్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ''ఇదొక లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కథ. కాలేజి పూర్తి చేసిన స్టూడెంట్ తను ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నడా..? తన ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది. ఇటీవల విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జూన్ 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, బెంగుళూరు ప్రాంతాల్లో కూడా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
హీరో వికాష్ మాట్లాడుతూ.. ''లవ్ సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కాని ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్. ట్రైలర్స్ కి, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. యూత్ కి, ఫ్యామిలీకి నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.
మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపిస్తాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ స్టోరీ ఇది. మారుతి గారి సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ఈ సినిమాతో మరో మంచి పాత్రలో నటించే అవకాశం దక్కింది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: జుడా శాండీ, ఎడిటింగ్: రాజు లీల, లిరిక్స్: చాణుక్య, డాన్స్: కెవిన్, బాబి ఆంటోనీ, నిర్మాత: కనవరెడ్డి నాగేశ్వరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్ కుమార్.