Advertisementt

పోస్ట్ ప్రొడక్షన్ లో 'అమ్మకు ప్రేమతో'!

Tue 07th Jun 2016 11:58 AM
ammaku prematho movie,krishnudu,udaya bhaskar  పోస్ట్ ప్రొడక్షన్ లో 'అమ్మకు ప్రేమతో'!
పోస్ట్ ప్రొడక్షన్ లో 'అమ్మకు ప్రేమతో'!
Advertisement
Ads by CJ

కృష్ణుడు, సన, రామసత్యనారాయణ ప్రధాన పాత్రల్లో ఆర్.కె ఫిల్మ్స్ పతాకంపై పి.ఉదయ భాస్కర్ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మకు ప్రేమతో'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా..

దర్శకుడు ఉదయ భాస్కర్ మాట్లాడుతూ.. ''గతంలో ఎన్నో చిత్రాలను రూపొందించాను. అన్ని చిత్రాలకు అవార్డ్స్ దక్కాయి. చివరిగా నేను చేసిన సినిమా 'వెంగమాంబ'కు ఎనిమిది నంది అవార్డ్స్ వచ్చాయి. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదనే కాన్సెప్ట్ తో ముగ్గురు నటీనటులతో చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమాలో ఎటువంటి ఫైట్స్, డాన్సులు ఉండవు. హృదయాలను హత్తుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది'' అని చెప్పారు. 

నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''తల్లి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని అధ్బుతంగా తెరకెక్కించారు ఉదయ భాస్కర్. కృష్ణుడు సెంటిమెంట్ పాత్రలో బాగా నటించాడు. అర్జున్ మంచి మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలైలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

కృష్ణుడు మాట్లాడుతూ.. ''ఉదయభాస్కర్ గారితో నాకు పదిహేనేళ్ళగా మంచి పరిచయం ఉంది. ఆయన కథ చెప్పగానే బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడే ఓ మంచి సినిమా చేశాననే తృప్తి కూడా ఉంది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా. ఈ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 

మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. ''మూడు పాత్రలతో రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే సినిమా. అందరికి నచ్చే చిత్రమవుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: అర్జున్, కెమెరా: భాస్కర్, నిర్మాత: ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకత్వం: ఉదయ భాస్కర్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ