అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేపధ్య సంగీతంలో అంజన్ కె కళ్యాణ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత అంజన్ కె కళ్యాణ్ మాట్లాడుతూ... ‘స్వతహాగా చిత్రకారుడినైన నేను సినిమా మీదున్న ఆసక్తితో యానిమేషన్ నేర్చుకొని తద్వారా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ గారి సినిమాకు స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా 7 సంవత్సరాలు, శ్యాం ప్రసాద్ రెడ్డి గారి ‘అరుంధతి’ సినిమాకు స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నాను. రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర, అప్పలరాజు చిత్రాలకు క్రియేటివ్ సైడ్ పనిచేసిన నేను ‘అత్తారిల్లు’ కథ రాసుకుని 18 సంవత్సరాల ఆశయాన్ని కసిగా చేసి రూపొందించిన చిత్రమే ఈ ‘అత్తారిల్లు’. మణిశర్మ గారికి ఈ సినిమా నచ్చి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్, డెన్నిస్ నార్టన్ సంగీతంలో వినసొంపైన రెండు మంచి పాటలతో పాటు ఎన్నో ఎంటర్‌టైౖన్‌మెంట్ అంశాలున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్దం చేస్తున్నాం. ఇటీవల తెలుగు ప్రేక్షకుల్లో వచ్చిన మార్పు చాలా సంతోషాన్నిచ్చింది. కథ, కథన బలాల ముందు ఏదీ పనిచెయ్యదని సక్సెస్ అయిన చిన్న సినిమాలు నిరూపించాయి. ఈ విషయాన్ని ‘అత్తారిల్లు’ మరోసారి రుజువు చేస్తుంది..' అన్నారు.
సాయి రవి కుమార్ , అతిథి దాస్, అనస్తేశియ చప్రసోవ, నండూరి రాము, రాకేశ్ శర్మ, ఉదయ్ శరత్, జోజూ, ఆర్‌జె వంశీ రామరాజు, ఎక్కా వినోద్ కుమార్, రాజేంద్ర పులి, రాజశేఖర్, మమత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ, పాటలు: డెన్నిస్ నార్టన్, కెమెరా: శివశంకర వరప్రసాద్, డాన్స్: జోజూ, ఫైట్స్: రెబల్ మాస్టర్, కో-డైరెక్టర్: కరణం వి లోకనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యం.హెచ్.రెడ్డి, సమర్పణ: అక్షయ్-అశ్విన్, కో- ప్రొడ్యూసర్స్: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి. కె. కళ్యాణ్, కథ - స్క్రీన్‌ప్లే - నిర్మాత - దర్శకత్వం: అంజన్ కె కళ్యాణ్.