Advertisementt

ఆర్పీ మనలో ఒకడంట..

Sun 05th Jun 2016 06:48 PM
manalo okadu movie,manalo okadu movie,manalo okadu movie stills,manalo okadu news,manalo vakadu  ఆర్పీ మనలో ఒకడంట..
ఆర్పీ మనలో ఒకడంట..
Advertisement
Ads by CJ
>సంగీతదర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ పట్నాయక్ లో మంచి నటుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. శీను వాసంతి లక్ష్మి, బ్రోకర్ వంటి చిత్రాల్లో నటుడిగా భేష్ అనిపించుకున్నారు ఆర్పీ. బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్, తులసీ దళం వంటి చిత్రాలు ఆర్పీలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించాయి. ప్రస్తుతం ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మనలో ఒకడు. >నువ్వు నేను ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయిక. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్  ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ తో ఈ చిత్రం 90 శాతం పూర్తయింది.
>ఈ సందర్భంగా నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ - కృష్ణమూర్తి అనే సామాన్య లెక్చరర్ కథ ఇది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆర్పీ పట్నాయక్ గారు దర్శకత్వం వహించిన బ్రోకర్ ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం దాన్ని మించే స్థాయిలో ఉంటుంది. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఒక పాట, క్లయిమ్యాక్స్ మినహా సినిమా పూర్తయింది. ఈ నెల 16నుంచి నెలాఖరు వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ