Advertisementt

బ్రెయిన్ తో కాకుండా హార్ట్ తో రాశా: త్రివిక్రమ్!

Sun 05th Jun 2016 05:17 PM
a aa success meet,trivikram srinivas,samantha,nithin  బ్రెయిన్ తో కాకుండా హార్ట్ తో రాశా: త్రివిక్రమ్!
బ్రెయిన్ తో కాకుండా హార్ట్ తో రాశా: త్రివిక్రమ్!
Advertisement
Ads by CJ

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్, స‌మంత, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరో హీరోయిన్లుగా హాసినీ అండ్ హారిక క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'అ..ఆ'. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో..

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...''ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నాకిష్ట‌మైన రైట‌ర్ య‌ద్ధ‌న‌పూడి సులోచ‌నాదేవి గారిని క‌లిసి మాట్లాడాను .కొన్ని క్యార‌క్ట‌ర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్స్ కార్డ్ ఆమె పేరు వేయాల‌ని అప్పుడే అనుకున్నాం... కానీ కొన్నిటెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ వల్ల అది కుద‌ర‌లేదు. కానీ ఇప్ప‌డు 48 అవర్స్ మా టెక్నీషియ‌న్స్ శ్రమించి ఆమె పేరు థ్యాంక్స్ కార్డ్ ఎండింగ్ లో యాడ్ చేశారు. ఇక ఇక్క‌డితో వెబ్ మీడియా వారు పెద్ద ఇష్యూ చేయ‌కుండా దీన్ని ఇంత‌టితో ఆపేస్తార‌ని...అనుకుంటున్నాను. స‌మంత ఒక రోజు మీరు బ్రెయిన్ తో కాకుండా మాతో మాట్లాడిన విధంగా హార్ట్ తో ఎందుకు డైలాగ్స్ రాయ‌రని ప్ర‌శ్నించింది. అలా రాయడానికి ఈ సినిమాలో ప్ర‌య‌త్నించాను. ఇక స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి తో సినిమా త‌ర్వాత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తున్న త‌రుణంలో నితిన్ తో సినిమా చేస్తానంటూ ఒక‌సారి చెప్పావు.. కాబ‌ట్టి ఇప్పుడు నితిన్ తో  సినిమా చేయ‌డం ధ‌ర్మం అని నాకు గుర్తు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి థ్యాంక్స్. సీనియ‌ర్ న‌రేష్ గారు, రావు ర‌మేష్ గారు అద్భుత‌మైన న‌టన క‌నబ‌రిచారు. మిగ‌తా వారంద‌రూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా నితిన్, స‌మంతా ఈ సినిమా కోసం వారి పూర్తి స‌మ‌యాన్ని కేటాయించారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క‌రూ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. అందుకే ఇంత పెద్ద విజ‌యం సాధించింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు థాంక్స్'' అని చెప్పారు.

నితిన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం వెనుక మూడు కారణాలున్నాయి. ఆ మూడు కారణాలో ఒక‌టి, రెండూ, మూడు అన్నీ త్రివిక్రమ్ గారే. సినిమా రేపు రిలీజ్ అన్నప్పుడు కూడా ఎంతో శ్ర‌మించారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి క్రెడిట్ త్రివిక్ర‌మ్ గారికి ఇవ్వ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న క్లాస్, మాస్ డైర‌క్ట‌ర్ కాదు.. యూనివ‌ర్స‌ల్ డైర‌క్ట‌ర్. ఆయ‌న రైటింగ్, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌లే అందుకు కార‌ణం. ఇక మా నిర్మాత రాధాకృష్ణ గారు నా మార్కెట్ ఎంత..? ఏంటి అని ఆలోచించ‌కుండా న‌మ్మ‌కంతో  ఎక్కువ బ‌డ్జెట్ పెట్టారు.  నాకు మంచి హిట్ ఇవ్వ‌డ‌మే కాకుండా నా రేంజ్ కూడా పెంచారు. ఆయ‌నకు నా కృతజ్ఞతలు'' అని చెప్పారు.

సమంత మాట్లాడుతూ.. ''నాకు కొన్ని సినిమాలు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూస్ తెస్తే...మ‌రి కొన్ని సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ తెస్తాయి. కానీ ఈ సినిమా ఈ రెండూ తెచ్చి పెట్టాయి. ఇది ప‌ర్స‌న‌ల్ విక్ట‌రీ గా భావిస్తున్నాను. త్రివిక్ర‌మ్ గారి గ‌త సినిమాకు కొన్ని మిక్స్ డ్ రివ్యూస్ రావ‌డంతో  త్రివిక్ర‌మ్ గారు కొంచెం ఫీల‌య్యారు. నా త‌ర్వాత సినిమా ఏంటో చూపిస్తా అన్నారు. ఈ సినిమాకు చాలా మంది స‌పోర్ట్ చేశాం. మ‌నీ కోసం కాకుండా స‌క్సెస్ కోసం ప్ర‌తి ఒక్క‌రూ ప‌నిచేశారు. అనుకున్న ప్ర‌కారం ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టారు త్రివిక్ర‌మ్ గారు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన వారంద‌రికీ నా థ్యాంక్స్'' అని అన్నారు.

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ.. ''ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా 'అ..ఆ' సినిమా అవుతుంద‌ని నేను సినిమా చేసేట‌ప్పుడే చెప్పాను. అలాగే అయింది. ఇందులో అన్ని ఎమోష‌న్స్ ఉన్నాయి. నా సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు ఎంతో బూస్ట‌ప్ ఇచ్చిన సినిమా ఇది'' అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అజయ్, ప్ర‌వీణ్, హ‌రి తేజ‌, కృష్ణ చైత‌న్య శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ