Advertisementt

'అభినేత్రి' హారర్ సినిమా కాదు: తమన్నా

Fri 03rd Jun 2016 08:59 PM
abhinethri,thamanna,kona venkat,prabhudeva  'అభినేత్రి' హారర్ సినిమా కాదు: తమన్నా
'అభినేత్రి' హారర్ సినిమా కాదు: తమన్నా
Advertisement
Ads by CJ

ప్రభుదేవా, తమన్నా, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పోరేషన్, బిఎల్ఎన్ సినిమా, ఎంవివి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అభినేత్రి'. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను శుక్రవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''సినిమా టీజర్ అద్బుతంగా ఉంది. అభినేత్రి అనే టైటిల్ తమన్నాకు బాగా సూట్ అవుతుంది. ఇంతకముందు తనతో రెండు సినిమాలు చేసిన అనుభవంతో చెప్తున్నాను. కోన వెంకట్ ఒకరోజు ఈ సినిమా కథ చెప్పడానికి ఫోన్ చేశాడు. మంచి కథ. నాకు బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. ప్రభుదేవా గారు నాకు ఇష్టమైన వ్యక్తి. తను హైదరాబాద్ లో ఓ డాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది'' అని చెప్పారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. ''మంచి కథతో కూడుకున్న సినిమా. తమన్నా ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టి నటించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ''ఒకరి కథను తీసుకొని రైటర్ అనేవాడు సినిమాను నిర్మించడం గొప్ప విషయం. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని చెప్పారు

ప్రభుదేవా మాట్లాడుతూ.. ''నేను బొంబాయి వెళ్తే డైరెక్టర్ అయిపోతాను. హైదరాబాద్ లో ఎంటర్ అయితే డాన్స్ మాస్టర్ అయిపోతాను. ఈ సినిమా కథ నచ్చి తమిళంలో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. డైరెక్టర్ విజయ్ గారికి సహనం చాలా ఎక్కువ. నాకు అసలు పేషన్స్ అనేదే ఉండదు. ఈ సినిమా కోసం చాలా సహనంగా ఉంటూ.. ఆయన చెప్పినట్లు నడుచుకున్నాను. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది'' అని చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ.. ''కోన వెంకట్ గారు నా కెరీర్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి. నేను అభినేత్రి స్థాయి వరకు రావడానికి ఆయన కూడా ఓ కారణం. బాహుబలి లాంటి సినిమా తరువాత ప్రేక్షకులు నా నుండి కొత్తదనాన్ని కోరుకుంటారు. అందుకే నేను ఈ స్క్రిప్ట్ సెలక్ట్ చేసుకున్నాను. విజయ్ గారి స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాతో నటిగా ఇంకా బెటర్ అయ్యాను. ఈ సినిమాలో నటిస్తే ప్రభు గారితో ఇంటరాక్ట్ అవ్వొచ్చనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నాను. ఆయన కింగ్ ఆఫ్ డాన్స్ కాదు గాడ్ ఆఫ్ డాన్స్ అనాలి. అందరు అనుకుంటున్నట్లు ఇది హారర్ సినిమా కాదు. ఇది ఏ జోనర్ కు చెందిన సినిమానో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే'' అని చెప్పారు.

దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పాల్ లారెన్ నేను కలిసి కథ రాసుకున్నాం. ఈ సినిమా మొదలు పెట్టిన తరువాత మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నాకు సహకరించిన గణేష్ గారికి నా థాంక్స్. ఈ సినిమాలో ప్రభుదేవా గారి పెర్ఫార్మన్స్ అద్బుతంగా ఉంటుంది. తమన్నా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వినగానే ఒప్పేసుకుంది. స్టోరీ తనకు అంత బాగా నచ్చింది'' అని చెప్పారు.

కోన వెంకట్ మాట్లాడుతూ.. ''నేను ప్రభుదేవా గారికి స్టోరీ చెప్పడానికి బొంబాయి వెళ్లాను. ఆయన కథ విని మెచ్చుకొని నా దగ్గర స్టోరీ ఉంది వింటారా అనడిగారు. ఆ కథ విని వెంటనే సినిమా చేయాలనుకున్నాను. అంతగా నచ్చింది. ఈ సినిమాకు తమన్నా, ప్రభుదేవా, సోనుసూద్, విజయ్ నాలుగు స్థంబాలు. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నాం. ఏ బాషకు తగ్గట్లుగా ఆ భాషకు క్యారెక్టర్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకొని చేశాం. ఈ సినిమాకు పెద్ద అసెట్ స్టోరీ'' అని చెప్పారు.

సోనుసూద్ మాట్లాడుతూ.. ''ఇలాంటి ఓ మంచి కథలో నటించడం ఓ నటుడిగా అద్రుష్టంగా బావిస్తున్నాను'' అని చెప్పారు.

ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ.. ''కోన వెంకట్ నేను శంకరాభరణం తరువాత మంచి సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమా కథ బాగా నచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ