సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీ శ్రీ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. అదే రోజు ఆన్ లైన్ లో విదేశాలలో కూడా విడుదలతూ..తెలుగు సినీ ఇండస్ట్రీ లో కొత్త వరవడికి నాంది పలకనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో..
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ''తెలుగు వారు ఎందరిలో ఉన్నా.. వారికి వినోద సాధనం సినిమా. ఆ సినిమాతోనే నేను తెలుగు వారికి పరిచయమయ్యాను. ఏభై ఏళ్ళ క్రితం 'తేనెమనసులు' అనే ఈస్ట్ మన్ కలర్ తెలుగు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. గూడాచారి117, అల్లూరి సీతారామారాజు, సింహాసనం ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాను. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్3న విడుదల చేయబోతున్నాం. అదే రోజు విదేశాలలో ఆన్ లైన్ లో కూడా విడుదల చేస్తూ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నాం'' అని చెప్పారు.
విజయనిర్మల మాట్లాడుతూ.. ''శివ సబ్జెక్ట్ చెప్పినప్పుడు బాగా నచ్చింది. సెంటిమెంట్ డ్రామాతో కూడిన కథ. మంచి మ్యూజిక్ కుదిరింది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా చూపించారు. ఈ సినిమాలో 'ఎన్నిజన్మల బంధమో' అనే పాట ఉంటుంది. మా నిజజీవితాలకు దగ్గరగా ఉండే పాట. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు'' అని చెప్పారు.
ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ''పండంటి కాపురం సినిమా చూసి కృష్ణ గారికి అభిమానిగా మారాను. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయనను డైరెక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కృష్ణ, విజయనిర్మల గారి మీద ప్రేమపూర్వకంగా చేసిన సినిమా ఇది'' అని చెప్పారు.
రాజు నడింపల్లి మాట్లాడుతూ.. ''ఈ సినిమా జూన్ 3న విడుదల అవుతుంది. విడుదల రోజే ఆన్ లైన్ లో విడుదల అవుతున్న తొలి చిత్రమిది. కృష్ణ గారి సినిమాతో ఈ ట్రెండ్ మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ''శివ గారు కథ చెప్పి కృష్ణ గారితో సినిమా అనగానే ఒప్పుకున్నాం. కృష్ణ గారికి పెద్ద అభిమానులం. ఆయన సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ: రమేష్ డిఓ ప్రొడక్షన్స్, డైలాగ్స్: రామ్ కంకిపాటి, మ్యూజిక్: ఇ.ఎస్.మూర్తి, సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ డైరెక్టర్: అశోక్, ఎడిటర్: రమేష్, కాన్సెప్ట్ రైటర్: కళ్యాన్ జీ, కో డైరెక్టర్: రమేష్ రాజా.ఎం, ఫైట్స్: నందు, అసోసియేట్ డైరెక్టర్: విజయ భాస్కర్ కైలాసపు, నిమ్మకాయల కోటి, అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీ రామ్, కాస్ట్యూమ్స్: రమేష్, సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: తాండవ కృష్ణ, నారాయణ, ప్రొడక్షన్ మేనేజర్: కె.మల్లిక్, నిర్మాతలు: శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్, దర్శకత్వం: ముప్పలనేని శివ.