Advertisementt

'చుట్టాలబ్బాయి' తమన్ కోసం చూస్తున్నాడు!

Wed 25th May 2016 12:42 PM
chuttalabbayi,adhi,veerabhadram director,ss thaman,chuttalabbayi post production completed,hero aadi movie  'చుట్టాలబ్బాయి' తమన్ కోసం చూస్తున్నాడు!
'చుట్టాలబ్బాయి' తమన్ కోసం చూస్తున్నాడు!
Advertisement
Ads by CJ

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ...ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ప్రస్తుతం యు.ఎస్‌.లో వున్నారు. ఆయన రాగానే ఆడియో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం..అన్నారు. 

దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆదికి మరో మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది.. అన్నారు. 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ