బ్రహ్మాజీ, సత్యం రాజేష్, పావని, బేబీ యోధ, కారుణ్య ప్రధాన తారాగణంగా అరుణ శ్రీ కంబైన్స్ బ్యానర్ పై బాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వసుధైక'. నిడమలూరి శ్రీనివాసులు నిర్మాత. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు బాల మాట్లాడుతూ.. ''ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చారు. 1957 లో జరిగిన ఓ సంఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోతుంది. అలా చనిపోయిన ఆ పాప మరోసారి పుడుతుంది. తను మరలా పుట్టడానికి గల కారణాలేంటనేదే ఈ కథ ఇతివృత్తం. హారర్, సెంటిమెంట్, కామెడీ అంశాలతో నడిచే కథ. మే 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్టాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ.. ''కథ నచ్చి సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. అందరి సహకారంతో ఈ సినిమా పూర్తయింది. దీని తరువాత మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ అమొఘ్ దేశపతి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయి. సాహిత్య విలువలతో కూడిన చక్కటి పాటలను కంపోజ్ చేసే అవకాసం వచ్చింది. తల్లి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసే విధంగా ఒక పాట ఉంటుంది'' అని చెప్పారు.
శ్రీలత మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. తల్లి పాత్రలో నటించాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కారుణ్య, పావని, షాని తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: తిరుమలరావు బొడ్డేపల్లి, మ్యూజిక్ డైరెక్టర్: అమొఘ్ దేశపతి, మాటలు-పాటలు: బాషశ్రీ, కథ సహకారం& కో-డైరెక్టర్: మహేష్ పెద్దబోయిన, ఎడిటర్: గోపి సిందం, కొరియోగ్రాఫర్: రేలంగి కిరణ్, నిర్మాత: నిడమలూరి శ్రీనివాసులు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాల.