Advertisementt

వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420'!

Mon 23rd May 2016 01:44 PM
varun sandesh,mister 420 movie,ravikumar  వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420'!
వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420'!
Advertisement
Ads by CJ
వరుణ్ సందేశ్, ప్రియాంక భరధ్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి శోభారాణి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'మిస్టర్ 420'. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు. హరికుమార్ రెడ్డి గజ్జల నిర్మాత. ఈ సినిమా లోగోను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సంధర్భంగా..
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకు ఎంతో అవసరం. వారు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుండి సపోర్ట్ కావాలి. కానీ ఆ సపోర్ట్ ను ఎవరు అందించడం లేదు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు వారి ఆలోచనా ధోరణిని మార్చుకొని కొత్త వాళ్ళను ప్రోత్సహించాలి. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ స్టేజ్ లో ఉంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు ఎస్.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. ''నేను చెప్పిన కథ విని నాలో టాలెంట్ ను గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి థాంక్స్. వరుణ్ సందేశ్ కు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఇప్పటివరకు వరుణ్ చేసిన చిత్రాలన్నింటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది'' అని చెప్పారు.
నిర్మాత హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోను రిలీస్ చేసి.. సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ ముస్తఫా మాట్లాడుతూ.. ''నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. డైరెక్టర్ గారు నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు'' అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, ఎడిటర్: నందమూరి హరి, స్టంట్స్: నందు, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, మ్యూజిక్: ముస్తఫా, ఫోటోగ్రఫి: జశ్వంత్ , ప్రొడ్యూసర్: హరికుమార్ రెడ్డి.గజ్జల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రవికుమార్.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ