నేను సింగిల్‌గా ఉన్నానని ఎవరన్నారు? అని ఆమధ్య మీడియా ముందు అన్నప్పుడు సమంత ఏదో సరదాగా చెప్పింటుంది లే అనుకొన్నారంతా. కానీ సమంత అన్నంత పనే చేసింది. కాదు కాదు... చేసిందే చెప్పింది. ఒక యువ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్టు బయటపెట్టింది. అంతే కాదు, అతని గురించి బోలెడన్ని క్లూస్ కూడా ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే పేరు తప్ప అన్నీ బయటపెట్టేసినట్టుంది. అయినా సరే... సమంత ప్రేమించింది ఎవర్నబ్బా అని రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు తెలుగు జనాలు.
ఆ హీరోది చాలా మంచి మనసు అనీ, తాను సేవా కార్యక్రమాలు చేస్తే అతను ఎంకరే్జ్ చేస్తుంటాడనీ, వంట కూడా బాగా చేస్తాడని, కూల్‌గా ఉంటూ ఎలాంటి తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడనీ ఇలా బోలెడన్ని లక్షణాల్ని బయటపెట్టడంతో ఇప్పుడు సమంత బాయ్‌ఫ్రెండ్ గురించి ఓ అంచనాకి వస్తున్నారు సినీ జనాలు. ఎప్పట్నుంచో పరిచయమున్న యంగ్ హీరో అని చెప్పడంతో పాటు, అతను సమంత చేసే సేవా కార్యక్రమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడని కూడా చెప్పింది కాబట్టి ఆ హీరో మాకు తెలిసిపోయిందంటున్నారు. ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరోలోనే ఈ లక్షణాలున్నాయని చెబుతున్నారు.
ఆమధ్య సమంత ఓ చిన్నారికి హార్ట్ ఆపరేషన్ కోసం డబ్బు సాయం చేయమని ఓ హీరోని కోరింది. ఆయన వెంటనే స్పందించాడు. అతనే అని డౌట్ పడుతున్నారంతా. పైపెచ్చు వాళ్లిద్దరూ చాలా రోజులుగా సన్నిహితంగా ఉంటున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది కాబట్టి ఆ హీరోనే అని పక్కా అవుతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు కాబట్టి వాళ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. మరి సమంత ఆ కబురు ఎప్పుడు వినిపిస్తుందో!