మంచు లక్ష్మీప్రసన్న, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్'. కార్తీకేయ గోపాలకృష్ణ దర్శకుడు. వేళ్ళ మోనికా చంద్రశేఖర్, గుంజ ఉమా లక్ష్మీనరసింహారావు నిర్మాతలు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంచు విష్ణు క్లాప్ కొట్టగా.. మంచు మనోజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ''ఇదొక కామెడీ థ్రిల్లర్. కొత్త పాయింట్ తో కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను. ఈ సినిమాలో మంచు లక్ష్మీ గారు జడ్జి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే లక్ష్మీబాంబ్ అనే టైటిల్ ను సెలక్ట్ చేసుకున్నాం. జూన్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ''జూన్ 1 నుండి సినిమాను చిత్రీకరణ చేయబోతున్నాం. స్క్రిప్ట్ అద్బుతంగా వచ్చింది. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాం'' అని చెప్పారు.
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. ''పవర్ ఫుల్ జడ్జి పాత్రలో మంచు లక్ష్మీ గారు కనిపించబోతున్నారు. లక్ష్మీబాంబ్ ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో ఆమె క్యారెక్టరైజేషన్ కూడా అలానే ఉంటుంది. సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది'' అని చెప్పారు.
సునీల్ కాశ్యప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: డార్లింగ్ స్వామి, మేకప్: పి.మోహన్, కాస్ట్యూమ్స్: బి.కృష్ణ, ఆర్ట్: రఘు కులకర్ణి, డాన్స్: రఘు, సంగీతం: సునీల్ కాశ్యప్, ఫోటోగ్రఫీ: అంజి, నిర్మాతలు: వేళ్ళ మోనికా చంద్రశేఖర్, గుంజ ఉమా లక్ష్మీనరసింహారావు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కార్తీకేయ గోపాలకృష్ణ.