Advertisementt

'పోలీస్ పవర్' యాభై శాతం పూర్తి!

Wed 18th May 2016 04:32 PM
police power movie,siva jonnalagadda,basavappameru  'పోలీస్ పవర్' యాభై శాతం పూర్తి!
'పోలీస్ పవర్' యాభై శాతం పూర్తి!
Advertisement
Ads by CJ

శివ జొన్నలగడ్డ, నందిని కపూర్, ధరణి ప్రధాన పాత్రల్లో సర్వేశ్వర మూవీస్ బ్యానర్ పై గుద్దేటి బసవప్పమేరు నిర్మాతగా నిర్మిస్తోన్న చిత్రం 'పోలీస్ పవర్'. శివ జొన్నలగడ్డ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ యాభై శాతం పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా..

హీరో, దర్శకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ''ఇటీవల జరిగిన కాల్ మని యదార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ యాభై శాతం పూర్తయింది. ప్రస్తుతం 30 మంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాం. సినిమాలో టైటిల్ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.

నిర్మాత గుద్దేటి బసవప్పమేరు మాట్లాడుతూ.. ''నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని. డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుండి పోలీస్ పవర్ అంటే ఏంటో చూపించే సినిమా చేయాలనుకున్నాను. కానీ నాకు మంచి కథ దొరకలేదు. శివ చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఈ చిత్రాన్ని పోలీస్ అమరవీరులకు అంకితమిస్తూ పోలీస్ డే అనగా అక్టోబర్ 21 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నందిని, ధరణి, చదలవాడ హరిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: బి.ఎస్.కుమార్, ఫైట్స్: అవినాష్, నిర్మాత: గుద్దేటి బసవప్పమేరు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు-డాన్స్-సంగీతం-దర్శకత్వం: శివ జొన్నలగడ్డ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ