రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్ పై శివ ప్రసాద్ దర్శకత్వంలో అయితం.ఎస్.కమల్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉందా.. లేదా..?'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరధ్వాజ క్లాప్ కొట్టగా.. ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సంధర్భంగా..
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి ఎందరో దర్శక నిర్మాతలు వస్తున్నారు. వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. అదే విధంగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.
దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ''సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇదొక కొత్త వెర్షన్ సినిమా. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. ప్రేమ కథ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది'' అని చెప్పారు.
నిర్మాత కమల్ మాట్లాడుతూ.. ''ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. మే చివరి నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది'' అని చెప్పారు.
రామకృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
అంకిత మాట్లాడుతూ.. ''స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే కథ. ఇంటెర్వెల్ బ్యాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలుగుతుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్, నిర్మాత: అయితం.ఎస్.కమల్, సినిమాటోగ్రాఫి: ప్రవీణ్ కె బంగారి, మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ అండ్ సాగర్