Advertisementt

దాసరి రిలీజ్ చేసిన 'రైట్ రైట్' పాటలు!

Mon 16th May 2016 01:23 PM
right right movie audio launch,sumanth aswin,manu  దాసరి రిలీజ్ చేసిన 'రైట్ రైట్' పాటలు!
దాసరి రిలీజ్ చేసిన 'రైట్ రైట్' పాటలు!
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీ కృష్ణ నిర్మిస్తోన్న చిత్రం 'రైట్ రైట్'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని పార్క్ హయ్యత్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి.. వి.వి.వినాయక్, ఎం.ఎస్.రాజు లకు తొలి సీడీను అందించారు.  

దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు ముందే విన్నాను. ఈ మధ్యకాలంలో ఇంత మెలోడియస్ మ్యూజిక్ తో ఉన్న సినిమాలు రాలేదు. ఖచ్చితంగా ఈ సినిమా పాటలు సక్సెస్ అవుతాయి. సుమంత్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. హీరోకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్ తనలో ఉంది. డాన్స్ అధ్బుతంగా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్టివ్ గా డాన్స్ లు, పెర్ఫార్మన్స్ చేయడంతో పాటు మంచి పాత్రలో నటిస్తున్నాడు. అలాంటి పాత్ర హీరోలకు దొరకడం చాలా అరుదు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. తన నటనతో సుమంత్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో సుమంత్ తో పాటు ప్రభాకర్ కూడా నటించాడు. సాధారణంగా విలన్ పాత్రల్లో నటించేవారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రభాకర్ ను స్టేజీ మీద చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ''మంచి టైటిల్ ను పెట్టుకున్నారు. సినిమా పోస్టర్ చూస్తుంటే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'' సినిమా గుర్తొస్తుంది. మను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలి. సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ''మంచి టెక్నీషియన్స్ తో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాహుబలి ప్రభాకర్ ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కోసం ప్రభాకర్ చాలా కష్టపడ్డాడు. క్షణం, ఊపిరి వంటి కాన్సెప్ట్స్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలానే కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న మా సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు మను మాట్లాడుతూ.. ''ఈ సినిమా చేయడానికి కారణం ఎం.ఎస్.రాజు గారు. నేను ఇండస్ట్రీలో మొదట స్క్రిప్ట్ చెప్పింది ఆయనకే. డ్రైవర్ కు కండక్టర్ కు మధ్య జరిగే కథే ఈ సినిమా. నిర్మాత గారు ఎక్కడా.. కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సుమంత్ బాగా నటించాడు. ప్రతి టెక్నీషియన్ కష్టపడి పని చేశారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని చెప్పారు. 

ప్రభాకర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో సుమంత్ కు, నాకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. నాకు ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ జె.బి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకు పని చేయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

శ్రీమణి మాట్లాడుతూ.. ''ఎం.ఎస్.రాజు గారి కుమారుడి సినిమాకు అన్ని పాటలు రాయడం సంతోషంగా ఉంది. మంచి సాహిత్యంతో పాటలు ఉంటాయి. జె.బి.గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు.

కోటి మాట్లాడుతూ.. ''ప్రతి పాట క్యాచీగా ఉన్నాయి. దర్శకుడు మనులో మంచి టాలెంట్ కనిపిస్తుంది. విజువల్స్ చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. అశ్విన్ కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. ''సుమంత్ తో మా బ్యానర్ లో కేరింత సినిమా తీసి హిట్ కొట్టాం. ఈ సినిమాతో తనకు మరొక పెద్ద హిట్ రావాలి'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో బి.గోపాల్, సీనియర్ నరేష్, కోదండ రామిరెడ్డి, చంటి, సాయి కిరణ్ అడివి తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, మ్యూజిక్: జె.బి, డైలాగ్స్: డార్లింగ్ స్వామి, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, లిరిక్స్: శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్: కె.ఎం.రాజీవ్, కోరియోగ్రఫీ: విజె, కో ప్రొడ్యూసర్: ఎమ్.వి.నరసింహులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.శ్రీనివాస రాజు, నిర్మాత: జె.వంశీ కృష్ణ, డైరెక్టర్: మను.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ