Advertisementt

నిర్మాణానంతర కార్యక్రమాల్లో 4జి ..!

Sun 15th May 2016 08:38 AM
4g movie news,4g film details,4g movie in post prodction  నిర్మాణానంతర కార్యక్రమాల్లో  4జి ..!
నిర్మాణానంతర కార్యక్రమాల్లో 4జి ..!
Advertisement
Ads by CJ

ఉదయ్‌, చంద్రకళ, సన్నీ, సునంద నటీనటులుగా శ్రీసాయిలక్ష్మీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 4జి. శ్రీనివాస్‌ కరణం దర్శకుడు. కె.వి.వినోద్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తైంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ...బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఉన్న నలుగురు యువత ఆ ప్రేమ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరికి ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారి తీసింది అనేది కథ. సమాజంలో చాలామంది యువతీయువకుల జీవితాలకు దగ్గరగా ఉండే కథ ఇది అని అన్నారు. 
నిర్మాత వినోద్‌రెడ్డి మాట్లాడుతూ... కథ వినగానే మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకంతో వెంటనే సినిమా స్టార్ట్‌ చేశాం. వైజాగ్‌, అరకు తదితర ప్రాంతాల్లో నిర్విరామంగా చిత్రీకరణ పూర్తి చేశాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. 
నటీనటులు-సాంకేతిన నిపుణులు: 
ఎఫ్‌.ఎమ్‌.బాబాయ్‌, సన, కరుణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సోమన్‌, సంగీతం: సుక్కు, ఎడిటర్‌: శ్రీగుహ, కో-ప్రొడ్యూసర్‌: లక్కరాజు రామారావు, పొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: రాజు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ