Advertisementt

'నేను సీతాదేవి' పాటలు విడుదల!

Sat 14th May 2016 02:56 PM
nenu seethadevi audio launch,sandeep,srinivas mallam  'నేను సీతాదేవి' పాటలు విడుదల!
'నేను సీతాదేవి' పాటలు విడుదల!
Advertisement
Ads by CJ

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన పాత్రల్లో కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ నిర్మిస్తోన్న చిత్రం 'నేను సీతాదేవి'. ఎం.ఎస్.రాజు, పాశం యాదగిరి, ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి బిగ్ సీడీని విడుదల చేయగా.. ఎం.ఎస్.రాజు తొలి సీడీని యాదగిరి రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా..

ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు చాలా బావున్నాయి. ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలి'' అని చెప్పారు.

దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ.. ''సీత, దేవి అనే ఇద్దరమ్మాయిల కథ ఇది. కథ వినగానే సందీప్ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాడు. చైతన్య మ్యూజిక్, సునీల్ కశ్యప్ రీరికార్డింగ్, శివ జి.కె. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని చెప్పారు.

సంగీత దర్శకుడు చైతన్య రాజా మాట్లాడుతూ.. ''మ్యూజిక్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సినిమా. నాలుగు పాటలు అధ్బుతంగా ఉంటాయి'' అని చెప్పారు.

నిర్మాత, హీరో సందీప్ మాట్లాడుతూ.. ''నన్ను ప్రోత్సహించిన మా నాన్నగారికి థాంక్స్. ఆయన ప్రోత్సాహంతోనే హీరోగా, నిర్మాతగా మారాను. దర్శకుడు శ్రీనివాస్ గారు చక్కగా రూపొందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అని చెప్పారు.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సన్ని కోమలపాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సునీల్ కశ్యప్, సంగీతం: చైతన్య రాజా, నిర్మాత: చిటుకుల సందీప్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ