Advertisementt

బ్రహ్మోత్సవం ఉత్సవం లాంటి సినిమా!

Fri 13th May 2016 08:22 PM
brahmothsawam movie,kajal,samantha,mahesh babu  బ్రహ్మోత్సవం ఉత్సవం లాంటి సినిమా!
బ్రహ్మోత్సవం ఉత్సవం లాంటి సినిమా!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం'. కాజల్ అగర్వాల్, సమంత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కాజల్, సమంత విలేకర్లతో ముచ్చటించారు.

కాజల్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో కాశి అనే ఎన్నారై అమ్మాయి పాత్రలో నటించాను. ఇప్పటి వరకు బబ్లీ, హైపర్ రోల్స్ లో కనిపించిన నేను ఈ సినిమాలో పరిణితి గల పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. చాలా మంది ఆర్టిస్ట్స్ ఉన్న సినిమా. దీన్ని హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. మహేష్ తో ఇది నా రెండవ సినిమా. ఈ సినిమాలో తను ఇంకా యంగ్ గా కనిపిస్తారు. స్పాంటేనియస్, మెథాడికల్ యాక్టర్ తను. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు. సమంత నేను మా పాత్రల విషయంలో సంతోషంగానే ఉన్నాం. పివిపి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించారు'' అని చెప్పారు.

సమంత మాట్లాడుతూ.. ''పేరుకి తగ్గట్లే ఉత్సవం లాంటి సినిమా. దూకుడు కంటే సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఈ రెండింటి కంటే బ్రహ్మోత్సవం సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. నాకు, మహేష్, వెన్నెల కిషోర్ ల మధ్య ట్రావెలింగ్ సన్నివేశాలుంటాయి. హరిద్వార్, ఉదయ్ పూర్, పూణే వంటి ప్రదేశాలు తిరగడం మంచి అనుభవాన్నిచ్చింది'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ