Advertisementt

'24' మూవీ సక్సెస్ మీట్!

Thu 12th May 2016 07:37 PM
24 movie success meet,vikram kumar,surya  '24' మూవీ సక్సెస్ మీట్!
'24' మూవీ సక్సెస్ మీట్!
Advertisement
Ads by CJ

హీరో సూర్య త్రిపాత్రాభినయం చేసిన చిత్రం '24'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, 2డి ఎంట‌ర్ టైన్మెంట్  బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ.. ''24 సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ కొట్టాను. ఈ సినిమాలో సూర్య నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో అజయ్ కీలకపాత్ర పోషించారు. ఏ పాత్రలో అయినా చక్కగా నటించగలరు. ఈ సినిమా కోసం అందరు కష్టపడి, ఇష్టపడి పని చేశారు. రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అధ్బుతంగా వచ్చింది. సమంత, నిత్యలు చక్కగా నటించారు. భవిష్యత్తులో వీరందరితో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను'' అని చెప్పారు.

అజయ్ మాట్లాడుతూ.. ''ఇష్క్ సినిమాతో నాకు డిఫరెంట్ రోల్స్ రావడం మొదలయ్యాయి. ఆ సినిమా నా కెరీర్ లో చాలా కీలకమైనది. అలానే ఇప్పుడు 24 సినిమా కూడా నా మనసుకు దగ్గరైన సినిమాగా భావిస్తున్నాను. సూర్య గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో లవ్, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి'' అని చెప్పారు.

ప్రవీణ్ పూడి మాట్లాడుతూ.. ''తమిళంలో ఎడిటర్ గా నేను చేసిన మొదటి సినిమా ఇది. సూర్య, రెహ్మాన్ లకు నేను పెద్ద ఫ్యాన్. వారితో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా అనిపించింది'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ