రాహుల్ రవీంద్రన్, రేష్మి మీనన్, జియా ప్రధాన పాత్రల్లో ఎస్.పద్మజ సమర్పణలో ఎస్.ఎన్.ఆర్.ఫిల్మ్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'హైదరాబాద్ లవ్ స్టోరి'. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాత. ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను నిర్వహించారు. సి.కళ్యాన్ యూనిట్ సభ్యులకు ప్లాటినం డిస్క్ లను అందించారు. ఈ కార్యక్రమంలో..
సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర నిర్మాత ఎస్.ఎన్.రెడ్డి, నేను రియల్ ఎస్టేట్ నుండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ సినిమాతో రాహుల్ కి మంచి బ్రేక్ రావాలి. విజువల్ గా సినిమా బావుంది. ట్రైలర్ లో దర్శకుడి ప్రతిభ కనబడుతోంది. తనకు మంచి భవిష్యత్తు ఉండాలి'' అని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''సినిమాలో పాటలు బావున్నాయి. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించినట్లున్నారు. సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ''మంచి టీంతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత రెడ్డిగారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. జూన్ నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ లానే సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి'' అని అన్నారు.
సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ రాజ్ సత్య చాలా ప్లానింగ్ తో సినిమాను తెరకెక్కించారు. అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మనీష్ ఠాగూర్, దర్శకుడు రాజ్ సత్య తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బి.వి.అమర్ నాథ్ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహ నిర్మాత: ఎస్.శ్రీ లక్ష్మి, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి, రచన-దర్శకత్వం: రాజ్ సత్య.