Advertisementt

సుప్రీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్..!

Mon 09th May 2016 09:13 AM
supreme success meet,supreme movie,saidharam tej,rashi khanna,anil ravi pudi,  సుప్రీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్..!
సుప్రీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్..!
Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు వచ్చాయి అందులో భాగమే మొన్న సరైనోడు పెద్ద హిట్టయింది, ఇప్పుడు సుప్రీమ్ పెద్ద హిట్టయ్యింది. బ్రహ్మోత్సవం ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ వెనుకే అండగా ఉంటుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా,బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పటాస్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన  అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం సుప్రీమ్. మే 5న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో అన్నీ ఏరియాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మే 8న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సినిమాలో ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ గా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లో నటించిన ఆనంద్ అండ్ టీంను సత్కరించారు. అనంతరం ఆయన ఇంకా మాట్లాడుతూ ‘’నేను సినిమా చూశాను, చాలా బావుంది. సాయిధరమ్ సూపర్ గా నటించాడు. తను భవిష్యత్ లో ఇంకా పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. అలాగే రాశిఖన్నాగారికి, దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ లకు అభినందనలు. దర్శకులు అనిల్ రావిపూడి ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. మికెల్ గాంధీ, ప్రభాష్ శ్రీను, పోసాని, వెన్నెలకిషోర్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, రవికిషన్ సహా అందరూ చక్కగా యాక్ట్ చేశారు. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన యూనిట్ సభ్యులందరినీ అభినందిస్తున్నాను’’ అన్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... 

సుప్రీమ్ సక్సెస్ లో హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ లకే క్రెడిట్ ముఖ్య భాగమైనప్పటికీ వీరితో పాటు మికెల్ గాంధీ నటన, క్లైమాక్స్ ఫిజికల్ చాలెంజ్ వ్యక్తులు చేసిన ఫైట్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి వారితో పాటు సీనియర్ యాక్టర్స్  రాజేంద్రప్రసాద్, సాయికుమార్ ల నటన సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది.రాశిఖన్నా గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాదు, కామెడితో ప్రేక్షకులను నవ్వించింది. అలాగే ప్రభాస్ శ్రీను- పృథ్వీ, పోసాని-శ్రీనివాస్ రెడ్డి కామెడి ట్రాక్స్ కు ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తుంది.  ఇక సినిమా క్లైమాక్స్ లో ఫిజికల్లీ చాలెంజ్డ్ వక్తులు ఫైట్ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అనిల్ రావిపూడి ఇలాంటి ఓ సీన్ పెట్టడం వల్ల ఓటమిని కూడా గెలుగుపుగా మార్చుకోవచ్చు అనే ఓ మెసేజ్ ను కూడా ఇచ్చాడు. అలాగే సాయికార్తీక్ మ్యూజిక్, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాలో సక్సెస్ లో కీ రోల్ పోషించాయి. సక్సెస్ కు భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ... 

చిత్ర నిర్మాతలు దిల్ రాజుగారు, శిరీష్, లక్ష్మణ్ గారు సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. సబ్జెక్ట్ ను నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేశారు. సినిమా గ్రాండ్ గా రావడానికి అవసరమైనవన్నీ సమకూర్చారు. బాలు అనే అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వల్లే చాలా బాగా చేయగలిగాను. సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య కెమెస్ట్రీ బాగుండాలని అంటారు అయితే ఈ సినిమాలో వెన్నెలకిషోర్, రాశిఖన్నాల మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడంతో వారి మధ్య కామెడి బాగా వచ్చింది. నేను రాజేంద్రప్రసాద్ గారిని డాడీ అని పిలుస్తుంటాను నాకు ఆయనకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్ లో ఇద్దరూ ఫీల్ కావడంతో ఏడుపు వచ్చేసింది. అలా మా మధ్య కూడా కెమిస్ట్రీ కుదిరింది. అలాగే నాకు మికెల్ గాంధీ మధ్య కూడా మంచి ర్యాపో ఏర్పడింది. చిన్నపిల్లాడైనా షాట్ అంటే వెంటనే సీన్ లోకి ఎంటరై పోయి అద్భుతంగా నటించేవాడు. రవికిషన్ వంటి సీనియర్ యాక్టర్ తో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సాయికార్తీక్ గారు సూపర్బ్ మ్యూజిక్ తో పాటు రీరికార్డిండ్ కూడా అదరగొట్టారు. సాయిశ్రీరాంగారు ప్రతి సీన్ ను ఎంతో రిచ్ గా చూపించారు. ఇలా ప్రతి సీన్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు ప్రేక్షకులు, మెగాభిమానుల సపోర్ట్ తోనే సినిమాను ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ...

 ఈ సినిమాను రామాయణం నుండి ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేశాం. రాముడు మికెల్ అయితే, హనుమగా సాయిధరమ్ తేజ్ నటించాడు. మిగిలిన నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ ప్రేమతో చేయడం వల్లనే ఇంత పెద్ద సక్సెస్ వీలైంది. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ తో ఫైట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఎంతో ఎమోషన్ ఫీలయ్యాను. అలాగే ఎగ్జయిట్ మెంట్ తో సినిమా చేశాను. రాజేంద్రప్రసాద్ గారు నాకేంతో ఇష్టమైన హీరో. జంధ్యాల, రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూడకుండా ఉండుంటే నేను నా సినిమాల్లో ఇంత మంచి కామెడిని చేసే చేయగలిగేవాడిని కాను. అలాగే నా వెల్ విషర్ సాయికుమార్ గారు అద్భుతంగా నటించారు. రాశిఖన్నా బెల్లం శ్రీదేవి పాత్రకు ప్రాణం పోసింది. రవికిషన్ గారు ఎంతో కమిట్ మెంట్ తో యాక్సిడెంట్ అయినా ఈ సినిమా చేశారు. సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్, పెర్ ఫార్మెన్స్ పరంగా నెక్ట్స్ లెవల్ కు వెళ్లాడని అంటున్నాడు. ఈ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైనర్’’ అన్నారు.

మికెల్ గాంధీ మాట్లాడుతూ ‘’నన్ను హైదరాబాద్ రాజన్ చేసినందుకు అనిల్ గారికి నాకు సపోర్ట్ గా నిలిచిన సాయిధరమ్ తేజ్, దిల్ రాజు, శిరీష్ గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.

రవికిషన్ మాట్లాడుతూ...

రేసుగుర్రం, కిక్ సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కు డిఫరెంట్ గా ఫెంటాస్టిక్ రోల్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ లకు థాంక్స్  అన్నారు.

సాయికుమార్ మాట్లాడుతూ ...

టీం వర్క్ తోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. మికెల్ , సాయిధరమ్, రాశిఖన్నా, వెన్నెల కిషోర్ సహా అందరూ చక్కగా నటించారు. ఈరోజు థియేటర్స్ కు వచ్చిన ’ఫ్యామిలీ ఆడియెన్స్ సహా  యూత్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. సాయిధరమ్ నటన చాలా చోట్ల అన్నయ్యను గుర్తుకు తెచ్చింది. రవికిషన్, శేషు, పోసాని, ప్రభాస్  శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, రాశిఖన్నా, వెన్నెలకిషోర్ ఇలా అందరి కామెడికి ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

 

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, ఈడోరకం ఆడోరకం సినిమాల తర్వాత నేను చేసిన అద్భుతమైన సినిమా సుప్రీమ్. మికెల్ గాంధీ అని చిన్నపిల్లాడు చేసిన నటన చూసి స్టన్ అయ్యాను. షాట్ చెప్పేవరకు ఎగురుతుంటాడు. షాట్ అనగానే వెంటనే సీన్ లోకి ఇన్ వాల్వ్ అయిపోతాడు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఎక్కువ భాగం అనిల్ రావిపూడికే దక్కుతుంది. సీన్ పేపర్ లేకుండా నాతో యాక్ట్ చేయించకున్నారు. తేజ్ లో యంగ్ చిరంజీవిని చూశాను. ఆయన్ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని సాయిఎదగాలి. శిరీష్ సినిమాను చక్కగా నిర్మించాడు. అందరికీ అభినందనలు’’ అన్నారు.

 

ఇంకా ఈ కార్యక్రమంలో పృథ్వీ, రాశిఖన్నా, ప్రభాస్ శ్రీను, సాయికార్తీక్, సాయిశ్రీరాం తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ అయినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement