తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోను పని చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన తన 72వ పుట్టినరోజు వేడుకలను మే 4న హైదరాబాద్ లో తన సన్నిహితులు,అభిమానుల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా..
దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''భగవంతుడు నాకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తద్వారా ఇండస్ట్రీకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుంది'' అని చెప్పారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ''అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో ఎప్పటికీ మా గురువు గారు సంతోషంగా ఉండాలి'' అని అన్నారు.
శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. ''దాసరి గారు ఒక జీనియస్. మల్టీ డైమెన్షనల్ పెర్సనాలిటీ. నేషన్ కు ఆయనొక హీరో. ఆయన ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
త్రిపురనేని వరప్రసాద్ మాట్లాడుతూ.. ''పరిశ్రమలో తల్లి, తండ్రి, గురువు రూపంలో ఉండే వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఎందరికో మార్గాలు చూపించి.. జీవితాలు ప్రసాదించిన మనిషాయన. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఇండస్ట్రీ ఉండాలని భావిస్తున్నాను'' అని చెప్పారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. ''దాసరి గారు ఇండస్ట్రీకు ఎంతో మందిని పరిచయం చేశారు. నాకే కాదు చాలా మందికి సహాయం చేశారు. అందరు బాగుండాలని కోరుకునే మనిషి'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, కోడి రామకృష్ణ, బాబు మోహన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.