Advertisementt

'గుప్పెడంత ప్రేమ' పాటలు విడుదల!

Wed 04th May 2016 12:30 AM
guppedantha prema audio release,vinod,navaneeth  'గుప్పెడంత ప్రేమ' పాటలు విడుదల!
'గుప్పెడంత ప్రేమ' పాటలు విడుదల!
Advertisement

సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ కిషన్ కలిసి బిగ్ సీడీను ఆవిష్కరించారు. సందీప్ కిషన్ ఆడియో సీడీలను రిలీజ్ చేసి మొదటి కాపీను వంశీకు అందించారు. ఈ సందర్భంగా..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''ఖాళీగా ఉన్నప్పుడు సినిమా ట్రైలర్స్ ఎక్కువగా చూస్తుంటాను. రీసెంట్ గా ట్విట్టర్ లో ఈ సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. పాటలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మ్యూజిక్ చాలా బావుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

వంశీ మాట్లాడుతూ.. '' వినోద్ తో మూడు సంవత్సరాలుగా పరిచయం ఉంది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. తను డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. విజువల్ గా కూడా సినిమా చాలా బావుంది. సినిమాలో పాటలన్నీ బావున్నాయి. బెస్ట్ ఆల్బం అవుతుంది'' అని చెప్పారు.

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాకు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు వినోద్. సినిమా గురించి తప్ప మరో మాట మాట్లాడడు. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

వినోద్ మాట్లాడుతూ.. ''అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఇది. ఫస్ట్ లవ్ లో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి.. ఆ ప్రేమ కాలాన్ని, దూరాన్ని ఎలా జయిస్తుందనే కాన్సెప్ట్ తో సినిమా తీశాను. రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ సినిమాలో ఉంటాయి. ఈ కథకు మ్యూజిక్ చాలా ముఖ్యం. ఈ సినిమాకు సంగీతమే సోల్. ప్రతి సాంగ్ అధ్బుతంగా ఉంటుంది'' అని చెప్పారు.

నవనీత్ సుందర్ మాట్లాడుతూ.. ''గుప్పెడంత ప్రేమ ఆర్డినరీ లవ్ స్టొరీ కాదు. హానెస్ట్ ఫిలిం. సినిమా కథ వినగానే బాగా నచ్చింది. సినిమాలో మొత్తం 8 పాటలు ఉంటాయి. అందరికి స్టోరీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి లిరిక్స్: వనమాలీ, శ్రీమణి, గణేష్, తిల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, ఆర్ట్: రాజీవ్ నాయిర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: నవనీత్ సుందర్, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, కథ-దర్శకత్వం: వినోద్ లింగాల.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement