అభినవ్, నరేన్, ఈశ్వర్, నిఖితా బిష్ట్ ప్రధాన పాత్రల్లో ధనుంజయ రెడ్డి కందిమళ్ళ సమర్పణలో ఇంద్ర కిలాద్రి సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా సోమవారం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో ప్రారంభమైంది. నిషాంత్ దర్శకుడు. తిరుమలశెట్టి నాగ శ్రీనివాస్ నిర్మాత. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ క్లాప్ కొట్టగా.. దర్శకుడు సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా..
దర్శకుడు నిషాంత్ మాట్లాడుతూ.. ''ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో పలు శాఖల్లో పని చేశాను. ఒక మంచి కథను తీసుకొని సామాజిక దృక్పధంతో సినిమా చేయాలని భావించాను. తల్లితండ్రులు పిల్లలపై ఎంతో వెచ్చించి చదువుల కోసం, ఉద్యోగాల కోసం సిటీకు పంపిస్తుంటే.. వారిలో చాలా మంచి తప్పు దారిలో నడుస్తున్నారు. దురలవాట్లకు లోనవుతున్నారు. వారిని మార్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను'' అని చెప్పారు.
నిర్మాత తిరుమలశెట్టి నాగ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారు నాకు రెండు, మూడు కథలు చెప్పారు. వాటిలో నాకు ఈ సినిమా కథ బాగా నచ్చింది. ఇలాంటి కథలు వస్తే సినిమాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు.
అభినవ్ మాట్లాడుతూ.. ''నటనలో శిక్షణ తీసుకున్నాను. యూత్ లో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో చేస్తోన్న సినిమా ఇది'' అని చెప్పారు.
నిఖితా మాట్లాడుతూ.. ''తెలుగులో ఇది నా రెండో సినిమా. యూత్ కు సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్: నాగిరెడ్డి, కెమెరా: విన్సెంట్ ప్రభు, నిర్మాత:తిరుమలశెట్టి నాగ శ్రీనివాస్, దర్శకత్వం: నిషాంత్.